ఇలానే చేస్తే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుంది..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యూజిల్యాండ్ లో టీడీపీ మహానాడు నిర్వహణలో భాగంగా వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు.ఐటీని ప్రమోట్ చేయడానికే ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఏర్పాటు చేశామని.

 Chandrababu Naidu Fires On Ys Jagan,latest Ap  Politics-TeluguStop.com

అమెరికాలో తిరిగి భారత్ కు ఐటీ కంపెనీలు రావాలని కంపెనీలను కోరామని అన్నారు.రాజకీయ కక్ష కోసం తాను ఎప్పుడూ ప్రయాత్నిచలేదని చంద్రబాబునాయుడు అన్నారు.

ఇండియాలో ఐటీ రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఆనాడే వివరించి చెప్పానని.మైక్రోసాఫ్ట్ ప్రనిధులను కలిసి హైదరాబాద్ లో బ్రాంచ్ ను పెట్టాలని కోరామని అన్నారు.

మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వస్తే ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీలు అక్కడకు వస్తాయని చెప్పారు.

ఇప్పుడు హైదరాబాద్ లో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి.

హైదరబాద్ అభివృద్ధిని చూసి తనకు చాలా సంతృప్తిగా ఉంటుందనని అన్నారు చంద్రబాబు నాయుడు.తన వల్ల వచ్చిన కంపెనీల వల్ల తనకు చాలా సంతృప్తిగా ఉందని అన్నారు.

కంపెనీలు పెరగడంతో ఇంజినీరింగ్ కాలేజ్ లు పెరిగాయి.అయితే ఆర్ధిక అసమానతలను తొలగించుకుంటూ పోవాలి అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే అభివృద్ధి జరగదు.

ఏపీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు చంద్రబాబు.సిఎం జగన్ అప్పులు చేసుకుంటూ పోతున్నాడు.

ఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో అప్పులు ఇచ్చే వారు కూడా ఉండరని.రాష్ట్రం దివాళా తీస్తుందని అన్నారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సంపద మీద దృష్టిపెట్టాలి.దాన్ని సృష్టించేలా చేయాలని.

అలాంటి పథకాలౌ తీసుకురావాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ వెళ్తుందని మండిపడ్డారు చంద్రబాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube