బాబు ని భయపెడుతున్నారు .. కాదు ఆయనే భయపడుతున్నాడు  

రాజకీయ పరిస్థితులు గందరగోలాగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయ నాయకుడైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి కూడా ఏమాత్రం అర్ధం కాని రీతిలో కనిపిస్తున్నాయి. ఒక వైపు చూస్తే టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతుండడం, అనేక ప్రజాకర్షక పథకాలు రోపొందించి అమలు చేస్తున్నా .. అది ప్రజల వరకు చేరకుండా మధ్యలో టీడీపీ నాయకులే అవినీతికి పాల్పడుతుండడం ఇవన్నీ పెద్ద పెద్ద అవరోధంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తుండడంతో ఇంకాస్త కంగారు పెడుతోంది. అదే సమయంలో వైసీపీ, జనసేన పార్టీలు ప్రజల్లోకి దూసుకు వెళ్తుండడం బాబు ని భయపెడుతోంది.

Chandrababu Naidu Fearing About Congress Party-

Chandrababu Naidu Fearing About Congress Party

ఇప్పుడు ఆ భయమే టీడీపీ కి ఆజన్మ శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కి దగ్గరేయ్యేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ ద్వారా చీల్చాలని బాబు ఆలోచన. అదే కనుక జరిగితే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఓటమి పాలవుతుందని తమ గెలుపు సులువు అవుతుందని టీడీపీ ప్లాన్. మరో వైపు చూస్తే… ప్రజా సంకల్పయాత్రలో అలుపెరగకుండా జగన్ జిల్లాను దాటి ఇంకో జిల్లాకు సాగిపోతూనే ఉన్నారు. మొన్ననే తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టారు. రాయలసీమ జిల్లాల్లో యాత్ర జరిగినంత కాలం ఒకలాగున్న జనస్పందన కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించేసరికి ఊపందుకుంది. ఇక, ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజాస్పందన గురించి చెప్పనే అక్కర్లేదు. పాదయాత్ర విషయంలో జగన్ కు వస్తున్న ఆధరణ చూసిన తర్వాత చంద్రబాబులో ఒక విధంగా ఆందోళన మొదలైందనే చెప్పాలి.

ప్రస్తుతం ఏపీలో ఏ పార్టీ కూడా బాబు కి మద్దతుగా నిలిచేందుకు ఇష్టపడడంలేదు. కమ్యూనిస్టులు కూడా పవన్ స్థాపించిన జనసేన వైపు చూస్తున్నారు. ఆయనే మా సీఎం అభ్యర్థి అని కూడా వారు ప్రకటిస్తున్నారు. మరో వైపు బీజేపీ, వైసీపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు టీడీపీనే టార్గెట్ చేసుకుని విమర్శల బాణాలు వదులుతున్నాయి.

Chandrababu Naidu Fearing About Congress Party-

ముఖ్యంగా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని పవన్ ఆరోపణలతో మరీ రెచ్చిపోతున్నారు. దాంతో పవన్ ఆరోపణలకు, విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేక లోకేష్ తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఇలా అన్ని వైపులా నుంచి ఎదురు దాడి ఎక్కువయిపోవడంతో .. చంద్రబాబులో ఆందోళన పెరిగిపోయింది. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే శక్తి చంద్రబాబులో లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అసలే అనుమానం. అందుకనే చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నట్లు స్పష్టమవుతోంది.