టికెట్ ఇస్తారా లేదా ..? అధినేతనే బెదిరిస్తున్న తమ్ముళ్లు

ముందు చూస్తే నుయ్యి … వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి.ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉండే ఏపీ ఎన్నికల్లో అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా.? అనే ఆందోళనలో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు సొంత పార్టీ నాయకుల నుంచి అసమ్మతి తో కూడిన హెచ్చరికలు వినిపిస్తుండడంతో చేయాలో ఏం చేయాలో పాల్గొని పరిస్థితుల్లో బాబు ఉండిపోయాడు.ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు బలపడకుండా … కనీస విశ్రాంతి కూడా తీసుకోకుండా కష్టపడుతుంటే సొంత పార్టీ నేతలే తనకు సహకరించకపోతే ఎలా అంటూ బాబు ఆవేదన చెందుతున్నాడు.

 Chandrababu Naidu Facing Demand About Party Ticket From Tdp Candidates-TeluguStop.com

ఇప్పటివరకు టిడిపిలో టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలి.? ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు అయితే గెలుపు గుర్రం అవుతాడు.? అని చంద్రబాబు డిసైడ్ చేశారు.అసలు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం టిడిపిలో లేదు.

నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పుడు గాని అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడం తెలుగుదేశం పార్టీ స్టైల్.కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ముందస్తుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో ముందుకు తీసుకుపోవాలని టిడిపి ప్లాన్ .దీనిలో భాగంగానే ముందస్తుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని బాబు అంత సిద్ధం చేసుకున్నాడు.అయితే ఆ జాబితాలో తమ పేరు ఉండాల్సిందే అంటూ కొంతమంది నాయకులు సాక్షాత్తు అధినేతనే హెచ్చరించే స్థాయికి వచ్చేసారు.

ముఖ్యంగా అనంతపురం జిల్లాలో జెసి బ్రదర్స్ ఈ విధంగానే బాబుకి హెచ్చరికలు చేశారట .తాము అత్యంత బలంగా ఉన్న ఈ జిల్లాలో మేము చెప్పిన వారికి కాకుండా వేరే వారికి టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే పార్టీని ఓడించడానికి కూడా వెనకాడబోమని సంకేతాలు పంపించారట.ఇక కర్నూలు లోనూ.ఇదే సీన్ రిపీట్ అవుతోంది.ఇక్కడ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తన కుమారుడు భరత్ కోసం కర్నూల్ టికెట్ ఇవ్వాలని గట్టి పట్టు పడుతున్నాడు.ఇప్పటికే నియోజకవర్గంలో తన వారసుడు తో అనేకసార్లు పర్యటించిన టీజీ తమ కుమారుని కాదని వేరే ఒకరికి టికెట్ కనుక కేటాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.

ఇక టిడిపి కంచుకోట లైన ఉభయ గోదావరి జిల్లాలోని దాదాపు ఇదే పరిస్థితి.దీంతో ఎన్నికల సమయంలో ఎవరిని ఏ విధంగా ఒప్పించాలి… తమ్ముళ్లను ఎలా బుజ్జగించాలి అనే సందేహంలో బాబు ఉండిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube