బాబు భయపడుతున్నాడు .. అందుకే అది వాయిదా వేస్తున్నాడా ..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు ఎన్నికల భయం బాగా పట్టుకుంది.పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు బాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

 Chandrababu Naidu Dont Want Ap Panchayat Raj Elections-TeluguStop.com

అసలు ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.కానీ ఇప్పుడు తప్పనిసరిగా దానిమీద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి బాబుకి ఉంది.

వాస్తవంగా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశమే టీడీపీకి లేదని అర్ధం అవుతోంది.ఈ విషయాన్నే క్యాబినెట్ మీటింగ్ అనంతరం స్పష్టమైన ప్రకటన చేయాలని టీడీపీ చూస్తోంది.

ప్రస్తుతానికి సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించి పాలన సాగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.కానీ అది ఎన్ని ఏళ్ళు అనేది మాత్రం తెలియడంలేదు.బాబు తీరును చూస్తుంటే మాత్రం ఇప్పుడప్పుడే ఎన్నికలను నిర్వహించే ఉద్దేశమే లేదని తెలుస్తోంది.ఇంతకీ ఎన్నికలను ఎందుకు వాయిదా వేస్తున్నట్టు? అంటే.దానికి కారణం భయమే అని చెప్పాలి.సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది.

ఇప్పుడు పంచాయతీతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది .ఒక వేళ ఫలితాలు తారుమారు అయితే అసలుకే ఎసరు వస్తుందనే ఆలోచనలో టీడీపీ ఉంది.

అందుకే ఇప్పుడు ఎన్నికల జోలికి వెళ్లే ఆలోచన కూడా చేసేందుకు బాబు జంకుతున్నాడు.పంచాయతీ ఎన్నికలకే కాదు ముందస్తు ఎన్నికలు వచ్చినా అందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు.ఆఖరికి నంద్యాల ఉప ఎన్నికలనే వాయిదా వేయించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారనే వార్తలు కూడా అప్పట్లో గుప్పుమన్నాయి.ఎప్పుడో జరగాల్సిన విశాఖ మున్సిపాలిటీ ఎన్నికలను కూడా చంద్రబాబు నిర్వహించడం లేదు.ప్రజలందరూ టీడీపీ వైపే ఉన్నారని .ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందంటూ గంభీరంగా ప్రకటనలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత ఎన్నికలంటే మాత్రం వణికిపోతున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube