రాహుల్ కి 'బాబు' షరతు ! కాంగ్రెస్ లో దుమారం రేగబోతోందా ...?     2018-11-07   10:46:51  IST  Sai Mallula

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు తగాదాలు…. అంతర్గత విబేధాలకు తావుండదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువ కాబట్టే నేను గొప్ప అనుకుంటే నేను గొప్ప అనుకుంటూ… నిత్యం వివాదాల్లో ఉంటుంటారు. ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల తంతు ఇంకా పూర్తికాలేదు.. పార్టీ ఇంకా అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ అప్పుడే సీఎం కుర్చీ కోసం నేనంటే నేను అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ఈ హడావుడిలో ప్రత్యర్థుల మీద దృష్టిపెట్టలేకపోతున్నారు. మాకు అధిష్టానం చెప్పిందే ఫైనల్ అంటూ పైకి చెప్పుకుంటున్నా… లోపల మాత్రం ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి.

Chandrababu Naidu Demands To Rahul Gandhi-

Chandrababu Naidu Demands To Rahul Gandhi

అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఒక సెటైర్ కూడా ఉంది అదేంటంటే కాంగ్రెస్ నాయకులకు ప్రత్యర్థులతో పనిలేదు వారికి వారే ప్రత్యర్థులు అని.ఇంతటి అంతర్గత కుమ్ములాటలలో మునిగి ఉండే పార్టీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త చిచ్చును పెట్టినట్టుగా తెలుస్తోంది. అదేమిటంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో రాహుల్ గాంధీ వద్ద కొన్ని షరతులు పెట్టాడట చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ఖర్చు అంతా తనే పెట్టుకుంటా, ఎన్నికల అనంతరం కూడా కాంగ్రెస్ కే మద్దతు పలుకుతా అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రిగా మాత్రం తన ఆమోదం ఉన్నవ్యక్తినే కూర్చోబెట్టాలని అన్నాడట.

Chandrababu Naidu Demands To Rahul Gandhi-

ప్రత్యేకించి రెడ్డి సామాజికవర్గం నేతను ముఖ్యమంత్రిగా చేయవద్దని.. రెడ్లు కాకుండా.. తను చెప్పిన వేరే వాళ్లను ముఖ్యమంత్రిగా చేయాలని చంద్రబాబు నాయుడు రాహుల్ వద్ద షరతు పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మెజారిటీ రెడ్లు కాంగ్రెస్ నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్టీ ఏదైనా రెడ్ల ప్రమేయం తప్పనిసరి. కాంగ్రెస్ పార్టీలో అయితే రెడ్లదే హవా ఉంటుంది. అలాంటి పార్టీలో రెడ్లను ముఖ్యమంత్రిగా చేయవద్దని చంద్రబాబు నాయుడు షరతు పెట్టాడట. ఈ అంశంపై ఇప్పుడు కాంగ్రెస్ లో దుమారం రేగేలా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో బాబు కి రాహుల్ ఏం సమాధానం చెప్పాడు అనేది మాత్రం ఇంకా బయటకి పొక్కలేదు.