ఆ విషయం నమ్మొద్దు తమ్ముళ్లు ! ఏంటో ఆ ధీమా  

Chandrababu Naidu Confidence On Win In Ap-janasena,pawan Kalyan,tdp,ycp,ys Jagan

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా తమ రిజల్ట్స్ ప్రకటించాయి. ఈ సారి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని తేల్చేశాయి. దాదాపు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే ఫిక్స్ అయిపోయారు..

ఆ విషయం నమ్మొద్దు తమ్ముళ్లు ! ఏంటో ఆ ధీమా -Chandrababu Naidu Confidence On Win In AP

కానీ ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అని , ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దని బాబు పదే పదే తమ కార్యకర్తలకు చెబుతున్నాడు. అంతే కాదు టీడీపీ 110 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు,18 నుంచి 20 ఎంపీ స్థానాలను గెలవబోతున్నట్టు చెబుతున్నాడు.

మేమే గెలవబోతున్నామని మైండ్‌ గేమ్ తో వైసీపీ గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని , కానీ ఎవరూ వారి మాటలు నమ్మొద్దు అంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు హితబోధ చేస్తున్నాడు. పోటీ చేసిన అభ్యర్థులకు, కౌంటింగ్ ప్రక్రియలో అందరూ అప్రమత్తంగా ఉండండి అంటూ చంద్రబాబు సూచనలు చేశారు.

ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని మెజార్టీ సంస్థలు వెల్లడించాయి. దీనిపై 2019, మే 20వ తేదీ సోమవారం టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ అందరిని బ్లాక్ మెయిల్ చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు..

ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఇప్పటికే శిక్షణ ఇప్పించిన బాబు మరోసారి మే 22న కౌంటింగ్ శిక్షణ నిర్వహిస్తామన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, మోదీ అన్ని వ్యవస్థలను బ్లాక్ మెయిల్ చేస్తూ, తన దారిన తెచ్చుకుంటున్నారంటూ విమర్శలు చేశారు.

ఎవరెన్ని చేసినా మే 23 తరువాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటూ బాబు ధీమాగా చెబుతుండడం టీడీపీ నాయకుల్లో గందరగోళం కలిగిస్తోంది. బాబు ఏ ధైర్యంతో పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాడో అంతుచిక్కడంలేదు.