పోలవరం విషయంలో కేసీఆర్‌ జోక్యం ఏంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీలో నిర్మాణం జరుగుతున్న పోలవరం ఎత్తును తగ్గించేందుకు చర్చలు జరుపుతామంటూ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఈ విషయమై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నాడు.

 Chandrababu Naidu Comments On Telangana Cm Kcr And Polvaram Project Chandrababu-TeluguStop.com

ఏపీ ప్రాజెక్ట్‌ విషయంలో మీ జోక్యం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.సీఎం జగన్‌ ఆలోచించకుండా పోలవరం విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ చంద్రబాబు నాయుడు సూచించారు.

పోలవరం విషయంలో ఎవరితోనూ చర్చలు జరపాల్సిన అవసరం లేదని, ఏవో ప్రయోజనాల కోసం ఏపీ ప్రజలను మోసం చేయవద్దని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణం ఆగిపోవడంపై కూడా మండి పడ్డాడు.

స్వార్ధం మరియు దురుద్దేశంతో మాపై కక్షతో పోలవరంను నిలుపుదల చేయడం జరిగిందని, ఆ ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube