బాబు గారికి ఓ డౌట్ : జగన్ ది పాదయాత్రా... విహార యాత్రా ...?     2019-01-10   20:36:17  IST  Sai Mallula

వైసీపీ అధినేత జగన్ దాదాపు ఏడాదిపాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాడు. ఈ యాత్రలో మూడొంతులకుపైగా నియోజకవర్గాలను టచ్ చేస్తూ… జగన్ యాత్ర చేసాడు. పులివెందులలో మొదలు పెట్టిన యాత్ర …శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు సాగింది. ఈ యాత్రలో జగన్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఓ కొత్త డౌట్ వచ్చింది. అసలు జగన్ చేసింది పాదయాత్ర …విహారయాత్రా అని.

Chandrababu Naidu Commented On Jagan-

Chandrababu Naidu Commented On Jagan

ప్రతి వారం ఆయన ఇంటికి వెళ్లారని, కాబట్టి … ఇది ఫ్యాన్సీ యాత్ర అని బాబు విమర్శించారు. అంతే కాకుండా ఈ యాత్రకు పవిత్రత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.రాత్రి ఏడు గంటల తర్వాత జగన్ పాదయాత్ర చేయలేదని ఆయన అన్నారు.రోజూ ఎనిమిది కిలోమీటర్లే పాదయాత్ర చేశారని ఆయన అన్నారు.