స్పీడ్ పెంచిన సైకిల్ ! అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

ముంచుకొస్తున్న ఎన్నికల ముహూర్తాన్ని చూసి టిడిపి కంగారు పడుతుంది.అందుకే పాలనాపరంగా తీసుకోవాల్సిన అనేక నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది.

 Chandrababu Naidu Busy In Selecting Candidates From Tdp-TeluguStop.com

ఈ మేరకు ప్రజాకర్షక పథకాలతో ఓట్లు రాల్చే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు.ఇక మిగిలిందల్లా అభ్యర్థుల ఎంపిక.

ఇదే టిడిపికి కత్తి మీద సాములాంటి వ్యవహారం.అందుకే అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ జాబితాను తయారు చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమైనట్టు పార్టీలు చర్చ నడుస్తోంది.

ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం ఉండటంతో ఆ లోపు గానే అభ్యర్థుల ఎంపిక ప్రకటించి కంగారు లేకుండా చూసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు.ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులను పిలిచి వారితో చర్చించి అవసరమైతే వేరే వారికి సీటు ఎలా వారిని ఒప్పించేందుకు బాబు కసరత్తు మొదలు పెట్టాడు .అది కాకుండా పార్టీకి మేలు చేస్తారని నాయకులను కూడా వారి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని టిడిపి అధినేత ప్లాన్ చేస్తున్నారు.ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎటువంటి హామీ ఇస్తే కలిసి వస్తుంది.

ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేయాలి ఎవరు చేస్తే బాగుంటుంది.ఇలా అనేక అంశాలకు సంబంధించి నాయకుల అభిప్రాయం కూడా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

అందుకే… అభ్యర్థుల ఎంపిక వీలైనంత తొందరగా… పూర్తి చేసి పార్టీ ఎన్నికల ప్రచారం పూర్తి చెయ్యాలని… అంతే కాకుండా… ఇదే అవకాశంగా తీసుకుని ప్రత్యర్థి పార్టీ వైసీపీని ఇరుకున పట్టాలని బాబు చూస్తున్నాడు.పనిలో పనిగా … జనసేన మీద విమర్శలు చేయకుండా… ఆ పార్టీని కట్టడి చేయాలని సరికొత్త ఆలోచనతో బాబు ఉన్నాడు.ఇప్పటికే టిడిపి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఈ సంబంధించి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు బాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాడు.ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశంపై కూడా సీఎం నాయకుల వద్ద ప్రస్తావించారు.

తాను ఒక నెలరోజుల సమయంలో అన్ని జిల్లాలూ పర్యటిస్తాననీ, వీలైనన్ని బహిరంగ సభలకు హాజరౌతానని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని బాబు పార్టీ నాయకులకు సూచనలు చేసాడట.ఇక రాబోయే రోజుల్లో సైకిల్ స్పీడ్ అమాంతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube