బాబు ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న “60C”...!!!!  

బాబు ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న “60c”…!!!!-

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అంటారు.ఈ సామెత ఇప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సరిగ్గా సరిపోతుంది.బాబు హయాంలో ఉన్న అవకతవకలు, టెండర్ల పై విచారణ జరుపుతాం, తేడా ఉన్న కాంట్రాక్ట్ పనులపై రివర్స్ టెండర్ వేయిస్తం అంటూ బల్ల గుద్దిమరీ చెప్పిన వైసీపీ ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలని ముమ్మరం చేస్తోంది...

బాబు ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న “60c”…!!!!--Chandrababu Naidu Bothering About 60C-

బాబు ఐదేళ్ళ పాలనలో 60C అనే ఆయుధాన్ని ఉపయోగించి ఎన్నో అక్రమాలకి ఒడిగట్టారు అనేది వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన ఆరోపణ.అసలు ఈ 60C అంటే ఏమిటి.?? దీన్ని అడ్డుపెట్టుకుని బాబు ఎలాంటి ప్రయత్నాలు అక్రమాలకి పాల్పడ్డారు అనే వివరాలలోకి వెళ్తే.

బాబు ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న “60c”…!!!!--Chandrababu Naidu Bothering About 60C-

60C అంటే ప్రభుత్వం ఇచ్చిన ఒక పనిని కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేయకుండా ఉంటే అతడికి 60C నోటీసు ద్వారా అతడికి ఇచ్చిన పనులలో కొన్ని పనులని తొలగించి వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తారు.అందుకు ఈ 60C ఉపయోగపడుతుంది.ఈ ఐదేళ్ళ కాలంలో బాబు పనుల్లో అక్రమాల్ని చేయడానికి ఈ 60C ని పూర్తి స్థాయిలో వాడుకున్నారు అనేది లెక్కల్లో స్పష్టం అవుతోందనెదీ ప్రధాన ఆరోపణ.

అయితే జగన్ నీటి దగ్గర నుంచీ ఆఖరికి ఆఫీస్ లో వాడుకునే వైఫై సౌకర్యం వరకూ కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంటే ఈ 60C ద్వారా చేస్తున్న అక్రమాలకి అడ్డుకట్ట వేయకుండా ఉంటారా.ఈ క్రమంలోనే.

ఏ అస్త్రాన్ని అయితే బాబు ఉపయోగించి అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు అదే 60C ని ఉపయోగించి చంద్రబాబు కి చెక్ పెట్టడానికి సిద్దం అయ్యారు.గత టీడీపీ ప్రభుత్వం 16 వేల కోట్లు ఉన్న అంచనాలని 36 వేల కోట్లకి పెంచి భారీ స్థాయిలో అక్రమాలకి పాల్పడిందని, తవ్వే కొద్దీ ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మంత్రి ఆరోపించారు.పూర్తి స్థాయిలో విచారణ జరిపి అన్ని చోట్లా రివర్స్ టెండర్ వేస్తామని, అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే ఎవరిని వదిలిపెట్టమని మంత్రి తెలిపారు.ఈ పరిణామాలతో చంద్రబాబు కి ఇబ్బందులు తప్పవని బాబు ఉపయోగించి 60C అస్త్రం ఇప్పుడు బాబు కే ఎసరు పెట్టేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.