ఆ ముద్ర జగన్ తీయించుకుంటే బాబు వేయించుకున్నాడే ?  

Chandrababu Naidu Backs Jagan Name In Ap Elections-chandrababu Naidu,chandrababu Naidu Family In Ap Elections,elections In Ap,jagan,nara Lokesh,sharmila Ys,ys Jagan,ys Vijayamma

ఏపీలో వారసత్వ రాజకీయాలకు కొదవే లేదు. తాము అధికారం అనుభవించాలి , వీలైతే తమతో పాటు తమ వారసులు కూడా అధికారం చేపట్టాలి అనే విధంగా నాయకుల ఆలోచన మారిపోయింది. ప్రతి పార్టీలోనూ ఈ వారసత్వ రాజకీయాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటున్నాయి...

ఆ ముద్ర జగన్ తీయించుకుంటే బాబు వేయించుకున్నాడే ? -Chandrababu Naidu Backs Jagan Name In AP Elections

ఇక విషయానికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు సందర్భంగా కుటుంబ పార్టీగా వైసీపీ ముద్ర వేయించుకుంది. అయితే ఇప్పుడు ఆ ముద్ర వైసీపీ చెరిపేసుకుంది. గతంలో తన కుటుంబ సభ్యులకు ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఇచ్చిన జగన్ ఇప్పుడు వారిని పక్కనపెట్టగా, ఏ విషయంలో జగన్ మీద గతంలో ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు ఆ ముద్ర వేయించుకుంది.

2014 ఎన్నికల సమయంలో జగన్ పులివెందుల నుంచి అసెంబ్లీకి, విజయమ్మ విశాఖపట్నం పార్లమెంటుకు, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంటుకు, తమ్ముడు అవినాష్ రెడ్డి కడప పార్లమెంటుకు, మామ రవింద్రనాథ్ రెడ్డి కమలాపురం అసెంబ్లీకి పోటీ చేశారు. కాకపోతే వీరిలో విజయమ్మ ఒక్కరు మిగతా అందరూ విజయం సాధించారు. గతంలో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ జగన్ తన కుటుంబ సభ్యులకు టిక్కెట్లు కేటాయిస్తారని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. వీరిలో విజయమ్మ కానీ షర్మిల కానీ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా అది జరగలేదు.

ఒంగోలు, అనంతపురం పార్లమెంటు స్థానాల నుంచి వీరి పోటీ ఉండవచ్చని అనుకున్నారు. కానీ, వీరిద్దరినీ ఈసారి ఎన్నికల బరికి దూరం పెట్టాడు జగన్..

వారే కాకుండా ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ని కూడా జగన్ పక్కనపెట్టాడు. వీరు ఎవరూ పోటీ చేయకపోయినా జగన్ కోసం ఆయన కుటుంబసభ్యులు గట్టిగానే కష్టపడుతున్నారు.

విజయమ్మ, షర్మిల రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తుండగా జగన్ సతీమణి భారతి పులివెందుల బాధ్యత తీసుకున్నారు.టీడీపీ విషయానికి వస్తే జగన్ చెరిపేసుకున్న ముద్రను టీడీపీ వేయించుకున్నట్టు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి కుటుంబం నుంచి ఇద్దరికి కొత్తగా టిక్కెట్లు కేటాయించారు...

ఇప్పటి వరకు చంద్రబాబు, బాలకృష్ణ మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి మాత్రం నారా లోకేష్ కు కూడా టిక్కెట్ ఇచ్చి మంగళగిరి, లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ కు విశాఖపట్నం పార్లమెంటు టిక్కెట్ కేటాయించారు. వీరే కాకుండా పార్టీ నేతల్లోనూ సుమారూ 15 మంది సీనియర్ నాయకుల కుమారులు, కూతుళ్లకు టిక్కెట్లు దక్కాయి.