ఆయన చెప్పినట్టు చేస్తారా ? ఏం తమాషా చేస్తున్నారా ?  

Chandrababu Naidu Angry On Chief Secretary-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఎక్కడలేని కోపం పొంగుకొచ్చేస్తోంది. రాజకీయాల్లో అందరికంటే సీనియర్ ని, ప్రస్తుత ముఖ్యమంత్రిని తన మాటే ఇప్పుడు ఏపీ అధికారులు వినడంలేదు అన్న విషయాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహారం బాబుకి మింగుడుపడడంలేదు...

ఆయన చెప్పినట్టు చేస్తారా ? ఏం తమాషా చేస్తున్నారా ?-Chandrababu Naidu Angry On Chief Secretary

ఆయన తన మాట అస్సలు లెక్కచేయకపోగా జగన్ చెప్పినట్టు నడుచుకోవడం మింగుడుపడడంలేదు. అంతే కాకుండా తాను ఏమి చేయాలనుకున్న అడుగడుగునా చీఫ్ సెక్రటరీ అడ్డం పడుతున్నాడని అసలు నా అధికారాల గురించి గుర్తు చేయడానికి ఆ చీఫ్ సెక్రటరీ ఎవరు అంటూ మండిపడుతున్నాడు. తాను ఎడ్డెమ్ అంటే తెడ్డం అంటున్నాడని ఇలా అయితే జగన్ కు సీఎస్ కు తేడా ఏముంది ? సీఎం గా తనకు కనీస గౌరవం ఇవ్వాలి కదా అంటూ బాబు తన మనసులో బాధను వెళ్లగక్కుతున్నాడు.


శ్రీవారి బంగారంపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అనేక ఆరోపణలకు దిగారు. వెంటనే ఈ విషయంపై స్పందించిన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రిని కూడా సంప్రదించకుండా విచారణ కమిటీ వేశారు. ఇది బాబుకి బాగా ఆగ్రహం తెప్పించింది.

అలాగే కొద్ది రోజుల క్రితం ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై సీఎస్ సమీక్ష చేసి మూసివేస్తామనే వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇవన్నీ జగన్ ఆదేశాల మేరకే సీఎస్ చేస్తున్నారని బాబు అసహనంగా ఉన్నాడు.

అదీ కాకుండా మీడియా కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ ఇంటర్వ్యూ లో చంద్రబాబు అపధర్మ ముఖ్యమంత్రి కాదని, ఆయన రెగ్యులర్ ముఖ్యమంత్రేనని చెబుతూ ఆయనకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో అధికారాలు లేవని సీఎస్ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ వ్యాఖ్యలను పరిశీలించిన బాబు ఈ విషయంపై తనకు వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ కు లేఖ రాశారు. అంత కుముందే ముఖ్యమంత్రి సచివాలయంలోకి వెళ్లిన సమయంలో కూడా ఆయన్ను కలిసేందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం రాకపోవడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో అధికారులు ఎవరు కూడా ముఖ్యమంత్రి సమీక్షలకు వెళ్లకూడదని ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ బాబు ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. తాను కేవలం 23 వరకే సీఎం గా ఉంటానని అనుకుంటున్నారేమో కాదు ఆ తరువాత కూడా నేనే ఉంటాను. ఆ విషయం గుర్తించుకోవాలంటూ బాబు గుర్తుచేస్తున్నారు.