పేరుకే మంత్రులం .. పెత్తనం అంతా వారిదే.. తెలంగాణ మంత్రుల్లో అసహనం  

Chandrababu Naidu And Son Authority On New Cabinet Meetings -

తెలంగాణ అధికార పార్టీలో ఇప్పుడో పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది.ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు దక్కించుకున్నా.

పెత్తనం చేసే అవకాశం మాత్రం లేకపోవడంతో మంత్రులు లోలోపల రగిలిపోతున్నారు.పేరుకే మేము మంత్రులుగా ఉన్నాం ఎందుకు ఏం ఉపయోగం మా చేతుల్లో ఏమీ లేదు ఆ తండి కొడుకులే పెత్తనం అంతా చెలాయిస్తున్నారు అంటూ తమ దగ్గరకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

పేరుకే మంత్రులం .. పెత్తనం అంతా వారిదే.. తెలంగాణ మంత్రుల్లో అసహనం-Political-Telugu Tollywood Photo Image

ఇంతకీ మంత్రుల బాధ ఏంటంటే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ షాడో సీఎం గా చెలామణి అవుతున్నఓ యువ మంత్రి గురించే వారి బాధ .తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్లు, పలుకుబడి గల నేతలు హైదరాబాద్ వచ్చి తెలంగాణ మంత్రులను కలిసి ఈ పనిచేసి పెట్టమని వినతి పత్రాలు ఇస్తున్నారట.దానికి ఆ మంత్రులు నిట్టూరుస్తూ ఆ వినతి పత్రం కింద వారి సంతకాలు పెట్టి పెద్దాయన, ఆయన కొడుకు వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారట.

మంత్రులకే బిల్లులు విడుదల, పనులు చేసిపెట్టే సామర్థ్యం లేకపోవడంపై వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారట.

తెలంగాణ మంత్రివర్గంలో ఇలా అధికారాలు లేకుండా మంత్రులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
కొద్దిరోజుల క్రితం ఓ ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి ఓ ఉపాధ్యాయ సంఘం ట్రాన్స్ ఫర్ల గురించి కాస్త సాయం చేయాల్సిందిగా రాష్ట్రంలోనే రెండు కీలక శాఖలు చూస్తున్న మంత్రి వద్దకు వెళితే ఆయన ఏమీ సాయం చేయలేక సంతకం పెట్టి షాడో సీఎం ని కలవమన్నారట.

తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఇద్దరు చెబితేనే అధికారులు వింటున్నారు.ఆ ఇద్దరి సంతకాలుంటేనే నిధులు విడుదలవుతున్నాయట.ఫైరవీలు, ఒత్తిడులకు ఏమాత్రం తలొగ్గడం లేదట అధికారులు.ప్రభుత్వాధినేత, ఆయన కుమారుడైన మంత్రి స్పష్టంగా చెప్పారట.నిధులు, విధులు, కీలక నిర్ణయాల్లో తాము చెప్పినట్టే చేయాలని ఏమంత్రి తీసుకొచ్చిన సిఫార్సు అయినా సరే తమ వద్దకు పంపాలని సూచిస్తున్నారట.
నిధుల దుర్వినియోగం అరికట్టడం.

క్రమశిక్షణ పేరుతో ఈ ఇద్దరు తండ్రికొడుకులు చేస్తున్న పని మిగతా మంత్రులను డమ్మీలుగా మారుస్తోందని విమర్శలు వచ్చినా ఆయన
మాత్రం లెక్కచేయడంలేదట.దీంతో మంత్రులు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక , సదరు మంత్రిని ఎదిరించలేక లోలోపల తెగ బాధపడిపోతున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు