వైఎస్ కి ఓటేసిన చంద్రబాబు       2018-06-27   00:18:15  IST  Bhanu C

ఒక పార్టీ గద్దెనక్కెనప్పుడు..గతంలో ఉన్న పార్టీ చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దానిని ఓన్ చేసుకోవడం అన్ని చోట్లా జరిగే విషయమే..ఈ విషయంలో చంద్రబాబు ది బెస్ట్ సీఎం ఫర్ సెల్ఫ్ డబ్బా అనే బిరుదుకూడా ఇవ్వచ్చు..తాము చేయని పనులు కూడా తామే చేశాము అని చంద్రబాబు చెప్పడమే కాదు పక్కన ఉన్న నేతలతో కూడా నిత్యం చెప్పిస్తూ మీడియాతో కూడా ఊదరకొట్టిస్తూ ఉండే వ్యక్తి చంద్రబాబు అంటారు..కానీ నిజం ఎన్నాళ్ళు దాస్తం ఎదో ఒక రోజు బయట పడుతుంది..ఇప్పుడు అదే జరిగింది చంద్రబాబు తాను చేశాను అని చెప్పుకుంటున్న ఒక మహత్తరమైన పనిని కాదు కాదు ఈ ఘనత కాంగ్రెస్ హయాంలో జరిగిందని వైఎస్ ఉండగానే జరిగిందని ఒప్పుకున్నారు..ఇంతకీ ఏమిటా ఘటన..ఏమిటా కధ అంటే వివరాలోకి వెళ్ళాల్సిందే..

గతంలోకి ఒక్కసారి వెళ్తే..వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా చేసిన సమయంలో జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్రం మొత్తంగా భారీ భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు.. అప్పట్లో ఆయన టైం లో మొదలు పెట్టినవే.. “ప్రాణహిత –చేవెళ్ల ” – “పోలవరం ” ప్రాజెక్టులు. వైఎస్ అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదు..అయితే. ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోవడం.. అంతకుముందు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ప్రాజెక్టుల ప్రారంభం జరగలేదు.

అయితే రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు – కేసీఆర్ లు వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి “కాళేశ్వరం” – “పోలవరం” కు కొత్త సొబుగులు అద్దారు. వైఎస్ హయాంలో తవ్వించిన కాలువల ఆధారంగానే చంద్రబాబు పట్టిసీమ – పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను చేపట్టారు.పట్టిసీమని ఎంతో త్వరితగతిన పూర్తి చేశామని గొప్పల డబ్బాలు కొట్టుకుంనారు.. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ “పోలవరం.. నరేంద్రమోడీ వరం” చెప్పేసరికి ఒక్కసారిగా చంద్రబాబు లో టెన్షన్ మొదలయ్యింది ఈ వ్యాఖ్యలు పడే పడే వినపడటంతో..

చంద్రబాబు ఈ వ్యాఖ్యలకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో అసలు నిజం చెప్పక తప్పలేదు..ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా పోలవరం పై అసలు విషయం చెప్పనియా చంద్రబాబు కన్నా పెట్టిన కంగారుతో..అసలు విషయం అందరి ముందు వెల్లడిచేశారు..అదేంటంటే… పోలవరం “మోడీ వరం “ అంటున్నారు అది కానే కాదు “కాంగ్రెస్ హయాంలోనే పోలవరం మొదలయ్యింది..కాంగ్రెస్ పార్టీనే ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.’ అంటూ కొత్త రాగం అందుకున్నాడు…బాబు ఈ వ్యాఖ్యలు చేసేసరికి అందరూ ఒక్క సారిగా అవ్వక్కయ్యారు.

పోలవరం ప్రాజెక్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైందన్న విషయాన్ని బాబు పరోక్షంగా ఒప్పుకుంటూ వైఎస్ వలెనే ప్రాజెక్ట్ వచ్చింది అనేట్టుగా పరిస్థితి మారిపోవడం తో చంద్రబాబు వైఎస్ కి ఓటేసి నట్టుగాగానే భావిస్తున్నారు వైసీపి నేతలు ఇప్పుడు వైసీపీకి కొండంత బలంగా మారింది…మేము పోలవరం తీసుకొచ్చింది పూర్తి చేసేది అంటూ డబ్బాలు కొట్టుకుంటున చంద్రబాబు బలే ఇరుకున పడ్డారు అంటూ తెగ సబరపడుతున్నారు వైసీపి నేతలు.