వారికే టిక్కెట్లు..తేల్చి చెప్పిన బాబు..విషాదం లో ఎమ్మెల్యేలు  

Chandrababu Naidu About West Godavari Constituency-elections In Ap,godavari Constituency,mla Tickets In Tdp,tdp

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నారు.ఇప్పటికే తెలంగాణా ఎన్నికల్లో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో రానున్న ఎన్నికలపై దృష్టిపెట్టారు...

వారికే టిక్కెట్లు..తేల్చి చెప్పిన బాబు..విషాదం లో ఎమ్మెల్యేలు -Chandrababu Naidu About West Godavari Constituency

అందులో భాగంగా తాజాగా నిర్వహించిన ఓ కీలక సర్వేలో పలు అంశాల ఆధారంగా ఎమ్మెల్యేలు ,మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో ఒక సమావేశం నిర్వహించారట.ఈ సమావేశంలో చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే.

చంద్రబాబుకి తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడం అలవాటే. అయితే గడిచిన సంవత్సర కాలంలో పలు సర్వేలు చేయించిన చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు మారకపోవడంతో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఖటినంగా ఉంటానని తెగేసి చెప్పారట.గెలుపు గుర్రాలకి టిక్కెట్లు ఇస్తానని.ఇందులో మొహమాటం ఏమీ లేదని తెగేసి చెప్పారట చంద్రబాబు.

ప్రజలతో నిరంతరం ఉండే ఎమ్మెల్యేలకే మాత్రమే భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో టికెట్టు ఇస్తానని, అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజామోదం మేరకే నిర్ణయం తీసుకొంటానని , వచ్చే ఎన్నికల్లో గెలుపు మంత్రం ఒక్కటే ప్రధానమైన అంశంగా ఉండాలని.పార్టీకి నష్టం చేకూర్చే వ్యక్తులని పక్కన పెట్టేస్తానని హెచ్చరించాట బాబు..

అయితే ఈ సర్వేలో ముఖ్యంగా గతంలో 15 స్థానాలకి 15 అందిచి టీడీపీని అధికారంలో నిలబెట్టిన పశ్చిమ గోదావరి జిల్లా లో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారట.

దాంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే లతో బాబు త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేయమని ఆదేశించారని టాక్ వినిపిస్తోంది…ముఖ్యంగా పోలవరం ,నిడదవోలు, భీమవరం, ఆచంట , కొవ్వూరు, నరసాపురం, ఉండి స్థానాలలో ప్రజలు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత చూపిస్తున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది…మరి చంద్రబాబు సదరు ఎమ్మెల్యేలకి ఎలాంటి క్లాక్స్ ఇస్తారో, అసలు టిక్కెట్లు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.