బీజేపీ కి జై కొట్టమని బాబు కి ఆయన చెప్పాడా ?  

Chandrababu Meets Ramoji Rao-

రాజకీయాల్లో లేకపోయినా రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఆరితేరిపోయిన వ్యక్తి , మీడియా మొఘల్ ఈనాడు రామోజీరావు గురించి తెలియని వారు ఉండరు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ తెరవెనుక చక్రం తిప్పడంలో బాగా ఆరితేరిపోయిన ఈనాడు రామోజీరావు తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చేర్చనీయాంసంగా మారింది. వాస్తవంగా చంద్రబాబు కి బిజీ షెడ్యూల్ ఉంది..

బీజేపీ కి జై కొట్టమని బాబు కి ఆయన చెప్పాడా ? -Chandrababu Meets Ramoji Rao

ఓ వైపు జాతీయ రాజకీయాలు, మరో వైపు కౌంటింగ్ ఎజెంట్లకు శిక్షణ, ఇలా అనేక వ్యవహారాల్లో బాబు తలమునకలై ఉన్నాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లో రామోజీతో బాబు భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆ తరువాత మళ్లీ అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వెళ్లారు.ఇంత బిజీలోనూ చంద్రబాబు, రామోజీరావుతో చర్చల కోసం ఫిల్మ్ సిటికీ వెళ్లడమే అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు రామోజీరావుతో అంత అత్యవసరంగా బాబు ఏం చర్చించారు అనేదానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు సంబందించిన అంశాలను గురించి బాబు కి రాజకీయ సలహాలు ఇచ్చేందుకు, ఓ జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించేలా ఒప్పించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు చర్చ జరుగుతోంది.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న సమయంలో. బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న రామోజీరావు బాబు ని బీజేపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్ ఎలాగూ తమకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు మద్దతు కూడా తీసుకుంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ జెండా రెపరెపలాడించవచ్చు అనే ఆలోచనలో రామోజీ ద్వారా బాబు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కొందరు చెబుతుంటే , మరికొందరు మాత్రం ఇటీవల రామోజీ మనవరాలు వివాహానికి సంబంధించి బాబు కి ఇప్పుడు విందు ఇవ్వడానికి పిలిచినట్టు మరికొందరు చెప్పుకొస్తున్నారు.