అందరం కలుద్దాం అంటూ మెట్లు దిగుతున్న బాబు .. ?  

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసిపిని ఎదుర్కోవడం అంత అషామాషి వ్యవహారం కాదని, జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కానీ, చేపడుతున్న సంస్కరణలు గాని తమ ఆశలపై నీళ్లు జల్లుతాయి అనే భయం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబులో తీవ్రంగా ఉంది.2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించాకంటే కచ్చితంగా బిజెపి, జనసేన, టిడిపిలు కలిసి పోటీ చేయాలని మొదటి నుంచి చంద్రబాబు భావిస్తూ వస్తున్నారు.అయితే బిజెపి మాత్రం టిడిపిని వీలైనంత దూరం పెడుతూనే వస్తున్నారు.పవన్ కళ్యాణ్ ను సైతం టిడిపికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది.అయినా బాబు పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.         అయితే ఆ సమయం ఇప్పుడు రానే వచ్చేసింది.

 Chandrababu Meets Pawan Kalyan Chandrababu, Tdp, Ysrcp, Ap,ap Cm Jagan, Ap Gover-TeluguStop.com

  రెండు రోజులు క్రితం విశాఖ ఎయిర్ పోర్ట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం,  ఆయనను వెనక్కి పంపడం వంటి ఘటనలు పెద్ద రాజకీయ దుమారమే రేపాయి.దీనికి సంఘీభావంగా చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిశారు.

దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.దీనికి తగ్గట్లుగానే ఆ భేటీ తర్వాత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అన్ని పార్టీలు,  ప్రజాసంఘాలు ,విద్యార్థులు అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని,  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం అందుకే పవన్ కళ్యాణ్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలుద్దాం కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడుదాం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.   

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Chandrababumeet, Tdpjanasena, Tdp, Ysrcp-Po

     వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని,  అక్రమ కేసులతో విపక్షాల గొంతు నొక్కుతోందని, తన జీవితంలో వైసీపీ లాంటి దారుణమైన పార్టీని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు విమర్శలు చేశారు.అన్ని పార్టీలు కలిసి రావాలని,  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని చంద్రబాబు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు.అయితే జనసేనతో రహస్యంగా ఒప్పందం కుదిరిందని ఎన్నికల సమయంలో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరుగుతూ వచ్చినా,  పవన్ తో పాటు,  జనసేన నాయకులు దీనిని ఖండిస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు దానిని నిజం చేసేలా కనిపిస్తున్నారు.అటు చంద్రబాబు,  ఇటు పవన్ సైతం పొత్తులతోనే ముందుకు వెళ్లాలని,  అప్పుడే వైసీపీని ఎదుర్కోగలమనే అభిప్రాయంతో ఉండడమే ఈ భేటీకి అసలు కారణంగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు వంటి వారు 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకున్న జనసేన ను కలుపుకు వెళ్లేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ.తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు తన స్థాయిని సైతం తగ్గించుకుని పవన్ కోసం,  జనసేన మద్దతు కోసం రాజకీయ మెట్లు దిగి కిందికి వస్తున్నట్లుగానే కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube