బాబుకి వారు టచ్ లో లేరా ? ఇదేదో అనుమానంగా ఉందే ?  

Chandrababu Meeting With Tdp Leaders-

ఏంటో ఎన్నికల ముందు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ చేసేవారు ఎక్కువగా కనిపిస్తుంటారు. పోలింగ్ అయిపోయాక ఆ సందడి పెద్దగా కనిపించదు. కాకపోతే ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకు ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్యెల్యేలను ఇంకో పార్టీలో చేర్చుకుంటూ ఉంటారు..

బాబుకి వారు టచ్ లో లేరా ? ఇదేదో అనుమానంగా ఉందే ? -Chandrababu Meeting With TDP Leaders

ప్రస్తుతానికైతే ఏపీలో ఎన్నికల ఫలితాలకు చాలా సమయమే ఉంది. ఈ లోపు కొంతమంది గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులతో బేరాసారాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తారు అనుకున్న వారిని వైసీపీ తమవైపు తిప్పుకునేందుకు సిద్ధం అవుతోంది అన్న వార్తలు టీడీపీలో కలవరం పుట్టిస్తున్నాయి.

దీనికి బలం చేకూరుస్తూ ఈనెల 22న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికి సుమారు 32 మంది అభ్యర్ధులు హాజరుకాకపోవడంతో బాబు వారి గురించి ఆరా తీసే పనిలో పడ్డాడు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంకి చెందిన తోట త్రిమూర్తులతో పాటు ఆ జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.దీనికి కారణం టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదని వారంతా ఒక అంచనాకు వచ్చేశారట.

ఇటువంటి పరిస్థితుల్లో తాము సమావేశాలకు వెళ్లినా ప్రయోజనం ఏముంటుంది అని వీరంతా ఆ సమావేశానికి డుమ్మా కొట్టేశారని సమాచారం.

ఇక మరి కొందరైతే పార్టీ ఎలాగూ గెలిచే సూచనలు లేవు కాబట్టి పార్టీ మారిపోతే అన్నిరకాలుగా లాభపడవచ్చు అనే ఆలోచనతో ఉన్నారట. అందులో భాగంగానే వైసీపీ నేతలకు వీరు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఈవిషయం తెలిసిన చంద్రబాబు వారిని బుజ్జగించాల్సిందిగా పార్టీ కీలక నాయకులు కొందరికి సూచించినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.

అలాగే ఇంకెవరు వైసీపీ నాయకులతో టచ్ లోకి వెళ్లకుండా పార్టీ అభ్యర్థులను అన్నిరకాలుగా కట్టడి చేయాలని బాబు ఆలోచన చేస్తున్నాడట.