“చంద్రబాబు”..ఆమరణ నిరాహార దీక్ష   Chandrababu Master Plan, To Sit On Hunger Strike     2018-04-09   21:23:35  IST  Bhanu C

ఏపీకి కేంద్రం ద్రోహం చేసింది..నమ్మించి గొంతు కోసింది..ఏంతో మంది ఏపీ ప్రజలూ కేంద్రం సాయం చేస్తుంది అని ఆశపడితే ఏపీ ప్రజల నోళ్ళలో మట్టి కొట్టింది..ఏపీ లో ఎవరిని కేంద్రం గురించి అడిగినా..మోడీ పేరు ఎత్తినా సరే ఈ వ్యాఖ్యలే వినిపిస్తాయి..

ఇప్పుడు ఎపీని కేంద్రం అనాధ లా వదిలేసింది..ముందొక మాట వేనుకోక మాట చెప్పి మోసం చేసింది…ఎపీకి హోదా విషయంలో కానీ హోదా హామీల అమలు విషయంలో కానీ మాటలు మారుస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కేంద్రం చుట్టూ 29 సార్లు తిప్పి చేతులు ఎత్తేసింది..దాంతో చంద్రబాబు ఎన్డీయే కి బీజేపి తో భందానికి రాం రాం చెప్పేశారు..


అయితే ఇక ఇప్పుడు మిగిలిందల్లా ప్రత్యేక హోదా ఉద్యమం ఈ ఉద్యమాన్ని చంద్రబాబు తన భుజాలపైకి ఎత్తుకోవాలని డిసైడ్ అయ్యారు..ఇప్పటికే ఓ సారి ఢిల్లీ లో అడుగు పెట్టి అన్ని దాదాపు అన్ని జాతీయ పార్టీ లీడర్ల తోను మాట్లాడి..అప్పటి వరకూ మోడీ ,రాహుల్ మధ్య జరిగే వార్ లోకి అనూహ్యంగా వచ్చారు చంద్రబాబు..నేషనల్ మీడియా సైతం చంద్రబాబు పై ఫోకస్ పెట్టింది.. చంద్రబాబు తో ముఖా ముఖి కార్యక్రమాలు పెట్టడం చేస్తూ చంద్రబాబు ని ఫోకస్ చేసింది..దాంతో చంద్రబాబు కి సంభందించిన విషయాలు కవర్ చేయకూడదు అతను ప్రముఖ చానెల్స్ కి ఫోన్ కాల్స్ వెళ్ళాయి..అయితే ఈ విషయాలని గమనించిన చంద్రబాబు మరోక ప్లాన్ వేశారు..

అదేంటంటే రెండురోజుల పర్యటనకే ఇంతటి రెస్పాన్స్ వస్తే..రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాజధాని నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకి దిగితే ఢిల్లీ కూసాలు కదలటం ఖాయం అని ఫిక్స్ అయ్యారు..ఇదే గనుకా చేస్తే మోడీ వ్యతిరేక బ్యాచ్ అంతా చంద్రబాబు కి సపోర్ట్ చేయడమే కాకుండా కర్ణాటకలో జరిగే ఎన్నిక ఫలితాలపై చంద్రబాబు దీక్ష భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఈ దీక్షని తన పుట్టిన రోజున ప్రారంభం చేయాలనీ భావిస్తున్నారట చంద్రబాబు నాయుడు..రాష్ట్రం కోసం ఒక ముఖ్యమంత్రి కేంద్రం పై పోరు చేయడం ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఇది టిడిపికి కూడా ఎంతో మేలు చేస్తుంది అనడంలో సందేహం లేదు..అయితే ఈ దీక్ష విషయంలో మరింత క్లారిటీ వచ్చిన తరువాత పూర్తి విషయాలు బయట పెడుతారని అంటున్నాయి టిడిపి వర్గాలు..