చంద్రబాబు మాస్ట‌ర్ ప్లాన్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా..?

రాజ‌కీయాల్లో గండ‌ర గండుడుగా పేరు సంపాదించిన నేత‌.వ్యూహం ప‌న్నితే ప్ర‌తిప‌క్షాల ఊహ‌కు కూడా అద‌ని ఫ‌లితం సాధించే ద‌మ్మున్న లీడ‌ర్‌.

 Chandrababu Master Plan Shock To Jagan, Jagan, Chandrababu , Ap Potics , Kuppam , Ysrcp , Tdp Party , Muncipal Elections ,naralokesh-TeluguStop.com

ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను అయినా స‌రే త‌న‌కు అనుకూలంగా మార్చుకునే విజ‌న్ ఉన్న వ్య‌క్తి ఆయ‌న‌.ఆయ‌నెవ‌రో కాదు నారా చంద్ర‌బాబు నాయుడు.

రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న వ్య‌క్తిగా చంద్ర‌బాబుకు ఎంతో పేరుంది.ఎన్నో ఆటుపోట్ల‌ను, మ‌రెంతోమంది నేత‌ల‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు.

 Chandrababu Master Plan Shock To Jagan, Jagan, Chandrababu , Ap Potics , Kuppam , Ysrcp , Tdp Party , Muncipal Elections ,naralokesh-చంద్రబాబు మాస్ట‌ర్ ప్లాన్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌హా మ‌హా నేత‌ల‌ను కూడా ఆయ‌న ఢీకొట్టారు.అంత‌టి అనుభ‌వం ఉంది కాబ‌ట్టే ఇంకా ఆయ‌న రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు.

అంత‌టి చ‌రిత్ర ఉన్న బాబు ఇప్పుడు శ‌ప‌థం ప‌ట్టి అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.ఇక వ‌రుస మీటింగుల‌తో వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు.ఎలాగైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ ఇవ్వాల‌ని రెడీ అయిపోతున్నారు.ఆయ‌న మొన్న మీడియా ముందుకు వ‌చ్చి క‌న్నీళ్లు పెట్టుకున్న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం అయింది.

ఇక ప్ర‌జ‌ల్లో కూడా బాగానే సింప‌తీ పెరిగిపోయింది.ఇక దీన్ని ఆయుధంగా చేసుకుని త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం న‌డుస్తోంది.

త‌న మీద ఉన్న సింపతీ త‌గ్గ‌క‌ముందు ఎన్నిక‌ల‌కు వెళ్లి త‌న బ‌ల‌మేంటో నిరూపించుకోవాల‌ని అనుకుంటున్నారంట‌.

ఇప్ప‌టికే కుప్పంలో అన్ని ఎన్నిక‌ల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది.అయినంత మాత్రాన త‌న‌కు ఆద‌ర‌ణ ఏమీ త‌గ్గ‌లేద‌ని, త‌న‌కు ఓటు బ్యాంకు ఇంకా అలాగే ఉంద‌ని నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారంట‌.ఇందులో భాగంగానే అర్జెంటుగా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.

త‌నకు జ‌రిగిన అవ‌మానాన్ని కుప్పం ప్ర‌జ‌ల‌కు వివ‌రించి సింపతీతో గెల‌వాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.తాను గెలిస్తే మ‌ళ్లీ కుప్పంలో టీడీపీకి మ‌ద్ద‌తు పెరుగుతుంద‌ని ఎన్ని త‌రాలు అయినా డోకా ఉండ‌ద‌ని భావిస్తున్నారంట చంద్ర‌బాబు.

మ‌రి రాబోయే కాలం ఎలా ఉంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube