జ‌గ‌న్‌ను తొక్కే స్కెచ్ రెడీ చేసిన బాబు

ఏపీలో అధికార టీడీపీ-విప‌క్ష వైసీపీ మ‌ధ్య రాజ‌కీయం మంచు రంజుగా ఉంది.విశాఖ‌లో ప్ర‌త్యేక హోదా నిర‌స‌న కోసం త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మానికి బాబు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ విష‌యంలో విప‌క్షాల‌న్ని ఒక్క‌ట‌య్యాయి.

 Chandrababu Master Plan On Jagan-TeluguStop.com

ఈ కార్య‌క్ర‌మం విష‌యంలో చాలా మీడియా సంస్థ‌లు, ఛానెళ్లు సైతం అధికార టీడీపీకే కొమ్ముకాశాయి.అయినా సోష‌ల్ మీడియాలో విష‌యం దాగ‌నందున ఇది అంద‌రికి తెలిసిపోయింది.

విశాఖ‌లో నిర‌స‌న‌ను ముందుగా యువ‌త త‌ల‌పెట్టినా.దానిని జ‌గ‌న్ భుజాన‌వేసుకోవ‌డం…అక్క‌డ‌కు వెళ్లిన జ‌గ‌న్‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో… విమానాశ్ర‌యంలో ర‌న్ వే మీదే బైఠాయించ‌డం జ‌గ‌న్‌కు బాగా క‌లిసివ‌చ్చాయి.

వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మానికి ముందుగా ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చాడు.ప‌వ‌న్ ట్వీట్ల‌తో, క‌విత‌ల‌తో రెచ్చిపోయాడు.

అయితే ఫైన‌ల్‌గా ర‌ణ‌క్షేత్రంలోకి జ‌గ‌న్ రావ‌డంతో అంద‌రి ఫోక‌స్ జ‌గ‌న్‌పైనే ప‌డింది.

అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వ్యూహం లేని జ‌గ‌న్‌…చివ‌రి క్ష‌ణాల్లో మాత్రం త‌న‌దైన వ్యూహంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు.

ఇది స‌క్సెస్ అయితే జ‌గ‌న్ క్రేజ్ తారాజువ్వ‌లా వెలిగిపోతుంద‌ని భావించిన చంద్ర‌బాబు స‌ర్కార్ అష్ట‌క‌ష్టాలు ప‌డి దీనిని స‌క్సెస్ కాకుండా విజ‌య‌వంతంగా అడ్డుకుంది.అయితే ఇప్పుడు జ‌గ‌న్‌ను ఏదోలా ఇరుకున పెట్టాల‌ని భావిస్తోన్న బాబు స‌ర్కార్ అందుకు వ్యూహాలు కూడా సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

విశాఖ విమానాశ్ర‌యంలో జ‌గ‌న్‌ను పోలీసులు అడ్డ‌గించిన‌ప్పుడు జ‌గ‌న్ రెండేళ్ల‌తో తాను సీఎం అవుతా…అంద‌రిని పేరు పేరునా గుర్తు పెట్టుకుని వారి అంతు చూస్తాన‌ని చెప్పారు.ఈ వ్యాఖ్య‌ల‌ను పోలీసులు కూడా రికార్డు చేశారు.

మీడియాలోను విస్తృతంగా ప్ర‌చారం అయ్యాయి.చ‌ట్టాన్ని కాపాడే పోలీసుల‌ను ఇవి బెదిరించేలా ఉన్నాయి.

ఇప్పుడు వీటి ఆధారంగానే జ‌గ‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

పోలీసులను బెదిరించ‌డం అంటే.

అది నాన్ బెయిల్‌బుల్ సెక్ష‌న్ల కింద‌కు కూడా వ‌స్తుంద‌ని అంటున్నారు.ఇలా జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేసేందుకు చంద్ర‌బాబు ఇన్‌డైరెక్టుగా ర‌క‌ర‌కాల స్కెచ్‌లు వేస్తున్న‌ట్టు వీటి ద్వారా అర్థ‌మ‌వుతోంది.

య‌రి వీటిని జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube