జగన్ కోట ని “డీ” కొట్టే చంద్రబాబు “మాస్టర్ ప్లాన్”..

ఏ పార్టీ అధ్యక్షులకి అయినా సరే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ తమ సొంత స్థానాలని కాపాడుకోవడం.మరియు తమ కొంచుకోటలో మరొక పార్టీ అడుగు పెట్టకుండా ఒక వేళ అడుగు పెట్టినా సరే తిరుగులేని ప్రజాభిమానం మనతో ఉండేలా చేయడం.

 Chandrababu Master Plan For Kadapa Mp Seat-TeluguStop.com

అయితే ఈ రెండు విషయాలలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపి అధినేత జగన్ మొహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి…కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో ఎన్నిక‌ల రేసులో వెన‌క‌ప‌డ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.జగన్ ప్రత్యర్దులని ఒక్కకరిని కలుపుకుని జగన్ కి చెక్ పెట్టే వ్యూహాన్ని రచిస్తున్నారు.ఇప్ప‌టికే వైసీపి నుంచీ టిడిపిలోకి వచ్చిన ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వాళ్లు అక్క‌డ జగన్ ని ఎదుర్కోవడంలో ఎంతో స్ట్రాంగ్‌గా నిలబడ్డారు…అయితే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ఎంపిక కావడంతో కడప రాజకీయాలో మరింత రంజుగా మారిపోయాయి.

ఇదిలాఉంటే ఇప్పుడు మాజీ మంత్రి డీఎల్‌.ర‌వీంద్రారెడ్డి టిడిపిలోకి వెళ్తున్నారు అంటూ వస్తున్నా వార్తలు నిజం అవుతున్నాయి.నిన్నటి వరకూ పోటీ గా ఉన్న పుట్టా ఇప్పుడు టిటిడి చైర్మెన్ గా ఇవ్వడంతో డీఎల్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైదుకూరు టీడీపీ టిక్కెట్ ఖ‌రారైన‌ట్టే…అయితే ఈ సమయంలో చంద్రబాబు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుతున్నారట.ఈ సారి అయినా సరే జగన్ ని దెబ్బకొట్టాలని కడప ఎంపీ సీటు ఎలా అయినా సరే టిడిపి ఖాతాలో వేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు చంద్రబాబు

ఈ క్ర‌మంలోనే డీఎల్‌ను కడప ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావిస్తున్నారట.

అంతేకాదు జిల్లా నేతలు సైతం డీఎల్ మాత్రమే సరైన వ్యక్తి అని తెలిపడంతో చంద్రబాబు కూడా డీఎల్ ని ఎంపీ అభ్యర్ధిగా దింపాలని భావిస్తున్నారట.గ‌తంలోనే డీఎల్ మంత్రిగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ నుంచి క‌డ‌ప ఎంపీగా జ‌గ‌న్ మీద పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే…డీఎల్ ముందు నుంచీ వైఎస్ ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళు వైఎస్ చనిపోయిన తరువాత జగన్ వైసీపిలోకి రమ్మని చెప్పినా సరే డీఎల్ ససేమిరా అన్నారు.

అందుకే డీఎల్ మాత్రమే అక్కడ జగన్ కి గట్టి పోటీ ఇవ్వగలడు అని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.త్వరలోనే డీఎల్ నో పార్టీలో చేర్చుకుని ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube