వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు సీరియస్ కామెంట్స్..!!

Chandrababu Makes Serious Comments On Ycp Government

టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం.ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 Chandrababu Makes Serious Comments On Ycp Government-TeluguStop.com

దాడులకి గల కారణం చూస్తే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం వైఎస్ జగన్ నీ ఉద్దేశించి.పరుష పదజాలంతో ఏకవచనంతో.

బూతులు తిట్టడం.ఈ క్రమంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలకు ఆయనను పోలీసులు అరెస్టు చేయడం అదే రీతిలో హైకోర్టు బెయిల్ ఇవ్వడం కూడా తెలిసిందే.

 Chandrababu Makes Serious Comments On Ycp Government-వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు సీరియస్ కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోపక్క పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేపట్టారు.ఇదిలా ఉంటే తాజా పరిస్థితిపై.

చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి.ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈరోజు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రపతితో భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

  యువత జీవితం నాశనం చేసే రీతిలో రాష్ట్రంలో డ్రగ్స్ బిజినెస్ ప్రభుత్వం దగ్గర ఉండి చేయిస్తుందని ఆరోపించారు.యువత జీవితాలను నాశనం చేసే రీతిలో.

ఏపీలో డ్రగ్స్ దందా కొనసాగుతుందని.చంద్రబాబు మీడియా సముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో మద్యపానం నిషేధం అని చెబుతూనే మరోపక్క అక్రమ మద్యాన్ని… ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహిస్తుందని.సంచలన ఆరోపణలు చేశారు.

అంత మాత్రమే కాక దేశంలో మొట్టమొదటి సారి రాష్ట్ర ప్రధాన పార్టీ కార్యాలయంపై దాడి జరగడం ఏపీలో.జరిగిందని మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఉద్దేశించి చంద్రబాబు స్పష్టం చేశారు.

వీటికి సంబంధించిన విషయాలు మొత్తం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఇదే సమయంలో డీజీపీ వ్యవహారం కూడా సరిగా లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

#TDP Mangalagiri #Chandrababu YCP #Chandrababu #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube