ఏపీ లో తండ్రికొడుకుల యాత్ర ?

ఏపీలో ఏదో రకంగా వచ్చే ఎన్నికల నాటికి టిడిపిని బలోపేతం చేయడంతోపాటు , 2024 లో జరిగే ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు.ఈ మేరకు దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే చంద్రబాబు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

 Handrababu Lokesh Is Planning To Take A Bus Bicycle Trip Ap, Tdp, Chandrababu, J-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం పెరిగిందని, మొదట్లో ఉన్న సానుకూల వైఖరి లేదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు.అందుకే వివిధ సమస్యలను హైలెట్ చేస్తూ,  తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న, నాయకులు ఆశించినంత స్థాయిలో యాక్టివ్ గా  కనిపించడం లేదని , అధికార పార్టీకి భయపడుతున్నారని, టిడిపి తరఫున యాక్టివ్ గా ఉంటే కేసులు చుట్టుముడతాయి అని ఇలా ఎన్నో అంశాలతో పార్టీ శ్రేణులు దూరంగా ఉంటున్న విషయాన్ని గుర్తించారు.

      అందుకే ఇక పూర్తిస్థాయిలో అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి పార్టీని,  నాయకులను ఒక గాడిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గల్లో  బస్సు యాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఉండి పూర్తిగా అక్కడ నాయకులు వ్యవహారశైలి,  పార్టీ పరిస్థితి,  కొత్తగా ఇక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి ఇలా అనేక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే చంద్రబాబు బస్సు యాత్ర కు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారంచంద్రబాబు యాత్రతో పాటు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వారా సైకిల్ యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నారు.

 

Telugu Ap, Chandrababu, Chandrababu Bus, Jagan, Lokesh Bycle, Ysrcp-Telugu Polit

     వాస్తవంగా లోకేష్ తో పాదయాత్ర చేయించాలని చూసినా, అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో , సైకిల్ యాత్ర చేయించాలని డిసైడ్ అయ్యారట.ఇలా చేయడం వల్ల లోకేష్ నాయకత్వం బలపడడం తో పాటు,  రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి మెరుగు అవుతుంది అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ బస్సు సైకిల్ యాత్ర ద్వారా పార్టీని పటిష్టం చేయడంతో పాటు,  వైసిపి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి జగన్ హవా ఏపీలో లేకుండా చేయాలనే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది.మరి ఈ బస్సు సైకిల్ యాత్ర ద్వారా టిడిపికి అదనంగా ఎంత వరకు మైలేజ్ వస్తుంది అనేది వేచి చూడాలి.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube