యువ నాయకులు.. వృద్ద నాయకులు ! బాబు లోకేష్ ఎవరూ తగ్గట్లే ? 

ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ మధ్య వార్ నడుస్తోంది.ఆ పార్టీ అధినేత చంద్రబాబు , జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మధ్య సీనియర్ జూనియర్ ల వివాదం నడుస్తూనే ఉంది.

 Chandrababu Lokesh Indirect War On Tdp Leaders Issue, Nara Lokesh, Tdp, Ap, Jaga-TeluguStop.com

పార్టీలో సీనియర్ నాయకులకు సముచిత గౌరవం ఇస్తూ,  వారి సేవలను వినియోగించుకోవాలని, వారి అనుభవం తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం అనేది చంద్రబాబు అభిప్రాయం కాగా,  సీనియర్ నాయకులు అవుట్ డేటెడ్ అని, వారి వల్ల పార్టీకి అనవసర భారం తప్ప, పెద్దగా ఉపయోగం లేదు అనేది యువ నాయకుడు లోకేష్ అభిప్రాయం.ఈ రెండు విషయాల మధ్య ఇద్దరి మధ్య పరోక్షంగా వివాదం నడుస్తోంది.

టిడిపిలో ఉన్న వృద్ద నేతలందరినీ పక్కనపెట్టి పూర్తిగా యువ రక్తంతో పార్టీని నింపాలని , అప్పుడే తెలుగుదేశం పార్టీ వైసిపి వంటి బలమైన పార్టీలను ఎదుర్కోగలదు అనేది లోకేష్ అభిప్రాయం కాగా,  చంద్రబాబు మాత్రం  ఈ విషయంలో లోకేష్ తో విభేదిస్తునే వస్తున్నారు.
    ఇదిలా ఉంటే, ప్రస్తుతం చంద్రబాబు లోకేష్ విడిగానే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నారు.చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని, నియోజకవర్గ ఇన్చార్జిలు చాలామంది సైలెంట్ గానే ఉండి పోతున్నారని,  ప్రభుత్వంపై పోరాడేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు అనే విషయాన్ని బాబుతో పాటు,  చంద్రబాబు గ్రహించారు.

లోకేష్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిలను చాలామందిని తప్పించి , నాయకులకు అక్కడ అవకాశం కల్పించాలని,  అప్పుడే తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని, సీనియర్లను పక్కన పెట్టాలని  బాబు పై ఒత్తిడి పెంచుతున్నారట.అయితే ఇప్పుడు అకస్మాత్తుగా సీనియర్లను పక్కన పెట్టి యువ నాయకులకు అక్కడ అవకాశం కల్పిస్తే, అనవసరంగా గ్రూపు రాజకీయాలు తలెత్తుతాయని,  దీనికారణంగా మొదటికే మోసం వస్తుందని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రయోగాలు సరికాదని, పూర్తిగా అన్ని చోట్ల యువ నాయకులకు ప్రాధాన్యం పెంచితే సీనియర్లు ఆగ్రహానికి గురి అవుతారని, వారి రాజకీయ అనుభవంతో ఫలితాలను కూడా తారుమారు చేసి టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తారనే  విషయాన్ని పదేపదే లోకేష్ కు హిత బోధ చేస్తున్నారట.
 

Telugu Ap Tdp, Jagan, Lokesh, Tdpconstency, Tdp, Ysrcp-Telugu Political News

  లోకేష్ మాత్రం ఈ విషయంలో చంద్రబాబు తో ఏకీభవించడం లేదని, సీనియర్ నాయకులుగా ఉన్న వారు తన నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదని, అటువంటి వారి వల్ల రానున్న రోజుల్లో తాను ఇబ్బందులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ఈ విషయంలో లోకేష్ ఇంతగా పట్టుబడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube