ఆహా సూపర్ ఛాన్స్ : జనసేన బీజేపీ ఎలా వాడుకుంటాయో ?

రాజకీయాలు ఒక్కోసారి అనుకోకుండా అనూహ్య మలుపులు తిరుగుతాయి.ఇప్పుడు ఏ పార్టీకి ఏ విధంగా ఆదరణ పెరుగుతుందో, ఏ పార్టీకి ఆదరణ తగ్గుతుందో చెప్పలేము.

 Janasena Party, Bjp, Telangana, Ap, Ycp, Ys Jagan, Chandrababu, Tdp,arrest-TeluguStop.com

అన్ని అకస్మాత్తుగా జరిగిపోతుటాయి.ఏపీలో అధికార పార్టీ వైసిపి , ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి మధ్య పోరు హోరాహోరీగా జరుగుతోంది.

టిడిపిని రాజకీయంగా బలహీనం చేసే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.టిడిపి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు బయట తీస్తున్నాడు.

దీనిలో భాగంగానే అనేక అక్రమాలకు సంబంధించి ఆధారాలు సంపాదించి, సాక్ష్యాలతో సహా బయట పెట్టడమే కాకుండా, అరెస్టుల వరకు తీసుకెళ్తున్నారు.ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వేరు వేరు కేసుల్లో అరెస్టు అయ్యారు.

ఇంకా అనేక మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ ను అరెస్ట్ చేయించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది.

ఇప్పటికే లోకేష్ కు సంబంధించిన అవినీతి వ్యవహారాలు అన్నిటిని సాక్ష్యాలతో సహా సేకరించినట్లు తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లోనే లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద ఎత్తున వలస వెళ్లేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి జగన్ కు జై కొట్టాలని చూస్తున్నారు.

ఇలా చెప్పుకుంటూ వెళితే టీడీపీకి ఇది క్లిష్టమైన సమయం.ఇక రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న జనసేన బీజేపీ పార్టీలు ప్రస్తుతం ఏపీలో తలెత్తిన రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నా, ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టినట్టుగా కనిపించడం లేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో అధికార పీఠం దక్కించుకోవాలంటే టిడిపి, వైసిపి తప్ప మూడో ప్రత్యామ్నాయ పార్టీకి అవకాశం లేదు అన్నట్టుగా ఉంది.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉన్నా, ఆయన రాజకీయాలు అంతంత మాత్రంగానే ప్రభావం చూపించగలుగుతున్నాడు.

Telugu Chandrababu, Janasena, Telangana, Ys Jagan-Telugu Political News

కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా ఏపీలో ఎదగలేకపోతుంది.దీనికి కారణం బలమైన పార్టీగా వైసిపి, టిడిపి లు ఉండడమే.ప్రస్తుతం వైసిపి అధికార పార్టీ గా ఉండగా, టిడిపి ప్రతిపక్ష పార్టీ గా ఉంది.అధికార పార్టీ వరుస సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్ళిపోతుంది.కోర్టు కేసులు, వివాదాస్పద నిర్ణయాలు ఎలా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, వైసిపి అన్ని విషయాల్లోనూ పై చేయి సాదిస్తున్నట్టు గానే కనిపిస్తోంది.అలాగే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ బలహీనం చేసే ప్రక్రియను కొద్దిరోజులుగా వేగవంతం చేసింది.

వచ్చే ఎన్నికల నాటికి టిడిపి ఉనికి కోల్పోయే విధంగా తయారు చేయాలన్నది జగన్ ప్లాన్ గా కనిపిస్తోంది.ఏపీ లో టిడిపి బలహీనపడితే ఎక్కువగా లాభపడేది వైసిపి జనసేన పార్టీ లే.వాస్తవంగా చెప్పుకుంటే టిడిపి యాక్టివ్ గా ఉన్నంతకాలం జనసేన బిజెపిలకు ఏపీలో అధికారం దక్కడం అనేది అంత సులువైన పని కాదు.తెలుగుదేశం బలహీనపడితేనే ఈ రెండు పార్టీలకు రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఉంటుంది.

కానీ ఈ విషయంలో బిజెపి జనసేన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.అవినీతి వ్యవహారాల్లో అరెస్ట్ అయిన టిడిపి నాయకులను వెనకేసుకువస్తూ జనసేన బి జె పి లు ఇంకా టీడీపీకి అనుబంధ పార్టీలుగానే కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టిడిపి ఎంత కిందికి దిగజరితే తమకు అంత లాభం అనే విషయాన్ని ఈ రెండు పార్టీల నాయకులు గుర్తించలేకపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube