చంద్రబాబు ని శశికళ తో పోల్చిన వైసీపీ మంత్రి..!!

Chandrababu Like Shasikala Said Ycp Minister

వైసీపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు.శ్రీశైల క్షేత్రానికి స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.

 Chandrababu Like Shasikala Said Ycp Minister-TeluguStop.com

అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సెటైర్లు వేశారు.కావాలని చంద్రబాబు  మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అక్కడ ఇటువంటి సంఘటన జరగకపోయినా గాని, జరిగినట్టు అభూత కల్పన సృష్టించి.

ప్రజలలో సింపతి పొందుకోవటానికి.దొంగ నాటకాలాడుతున్నారని తెలిపారు.

 Chandrababu Like Shasikala Said Ycp Minister-చంద్రబాబు ని శశికళతో పోల్చిన వైసీపీ మంత్రి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతకు ముందు పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేయడం జరిగింది.ప్రజలంతా గమనించారు, పెద్దగా ప్రయోజనం  మద్దతు రాలేదు.

అందుకే ప్రస్తుతం ఎత్తుగడ వేసుకొని ప్రజల ల్లోకి వెళ్లి.అసెంబ్లీలో ఎవరు అనని మాటను అన్నట్టుగా.

చంద్రబాబు ప్రజల మధ్య అంటున్నారు.

భగవంతుని సన్నిధిలో ఉండి నేను ఈ విషయం చెబుతున్నాను.

అసలు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ గారు కూడా లేరు.తుఫాను కారణంగా అధికారులను అప్రమత్తం చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఆ సమయంలో చంద్రబాబు రెచ్చగొట్టే తరహాలో ముందుగా ముఖ్యమంత్రి జగన్ గారి తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి షర్మిల బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ప్రస్తావన తీసుకు రావడం జరిగింది.ఆరోజు నేను కూడా అసెంబ్లీ లోనే ఉన్నాను.

కేవలం పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం అప్పట్లో జగన్ గారు అసెంబ్లీ నుండి వెళ్లిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.

Telugu Chandrababu, Shasikala-Telugu Political News

ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో జయలలిత కూడా ఇదే తరహాలో అసెంబ్లీలో శపధం చేశారు.ఇప్పుడు చంద్రబాబు చేసిన శపథం. శశికళ శపథం.

చంద్రబాబు కల నెరవేరదు.ఎందుకంటే ఆయన మనసులో చిత్తశుద్ధి లేదు.

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఉన్న బాధితులకు ముఖ్యమంత్రి జగన్ గారు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం ఇస్తుంటే.చంద్రబాబు మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో పొలిటికల్ మైలేజీ సంపాదించుకోవడం కోసం తెగ తాపత్రయ పడుతున్నారు.

ఇటువంటి చంద్రబాబుకి బుద్ధి వచ్చేలా ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

#Chandrababu #Shasikala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube