బాబు-జ‌గ‌న్‌-ప‌వ‌న్ ఎవ‌రి స‌బ్జెక్ట్ ఎంత‌...!

ఏపీ అధికార పార్టీ టీడీపీ, ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, మ‌రో ప‌క్షం జ‌న‌సేన‌లు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లో ఉంటున్నాయి.టీడీపీ సార‌ధి, సీఎం చంద్ర‌బాబు త‌న స్టైల్లో దూసుకుపోతున్నారు.

 Chandrababu-jagan-pawan Targets 2019 Elections-TeluguStop.com

ప‌థ‌కాలు, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌జ‌ల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్తున్నారు.ఎక్క‌డిక‌క్క‌డ విప‌క్ష వైకాపాను ఆయ‌న ఎండ‌గ‌డుతున్నారు.

ఇక‌, వైకాపా విష‌యానికి వ‌స్తే.ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని టార్గెట్‌గా పెట్టుకున్న జ‌గ‌న్‌.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు.హోదాను తాక‌ట్టు పెట్టారంటూ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

మరోప‌క్క, జ‌నసేనాని కూడా రంగంలోకి దిగిపోయాడు.ఇప్ప‌టికి మూడు చోట్ల స‌భ‌లు నిర్వ‌హించి.

త‌న మ‌న‌సులో మాట‌ను స్ట్ర‌యిట్‌గా చెప్పేస్తున్నాడు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే, ఈ ముగ్గురు నేత‌ల మ‌ధ్యే ప్ర‌ధానంగా 2019 ఎన్నిక‌ల్లో పోరు జ‌ర‌గ‌నుంది.దీంతో ఇప్పుడు ఈ ముగ్గురి పైనే అంద‌రి దృష్టీ ఉంది.

ఎవ‌రెవ‌రి మాట‌ల్లో.ఎవ‌రెవ‌రి ప్ర‌సంగాల్లో ఎంతెంత ప‌స ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున భేరీజు వేస్తున్నారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు ఎప్పుడు ఎక్క‌డ ప్ర‌సంగించినా.త‌న గ‌త పాల‌న‌ను ఉటంకించ‌డం ఆయ‌న‌కు పెద్ద అల‌వాటు.

దానిని పేర్కొంటూనే ప్ర‌స్తుత పాల‌నలో త‌న స్ట‌యిల్‌ను ఆయ‌న బ‌య‌ట‌పెడ‌తారు.ఎక్క‌డా కూడా విసుగు లేకుండా చెప్ప‌ద‌లుచుకున్న చెప్పేస్తారు.

పొల‌వరం, ప‌ట్టిసీమ‌, రాజ‌ధాని అమ‌రావ‌తి వంటి విష‌యాల్లో ఆయ‌న లెక్క‌లు వేసి మ‌రీ చెబుతారు.క్లారిటీ మిస్ కాకుండా చూసుకుంటారు.

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం కొంత క్లారిటీ మిస్ అవుతున్నార‌నే ఫీల్ ఉంటుంది.దీనికి ప్ర‌ధానంగా ఆయ‌న అనుస‌రించే భాష‌, ధోర‌ణులే కార‌ణం కావొచ్చు.

ఎప్పుడు చంద్ర‌బాబును ఏకే ధోర‌ణినే జ‌గ‌న్ అవ‌లంబిస్తుంటారు.అదేవిధంగా ప్ర‌తి దానికీ బాబు పాల‌న‌తో లింకు పెట్టి మాట్లాడ‌డం, ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్ప‌డం వంటివి మైన‌స్‌గా ప‌రిణ‌మిస్తున్నాయి.

వాస్త‌వానికి ఏపీ జ‌నాల్లో బాబు అడ్మినిస్ట్రేష‌న్‌పై ఎక్క‌డా ఎలాంటి కంప్ల‌యింట్ లేదు.అయితే, జ‌గ‌న్ మాత్రం బాబుకు అస‌లు పాల‌నే తెలీద‌న్న‌ట్టు విమ‌ర్శించ‌డం ఒక్కొక్క‌సారి ఆయ‌నకు రివ‌ర్స్ అవుతోంది.

దీంతో జ‌గ‌న్‌కి క్లారిటీ లేద‌నే టాక్ ఉంది.

మ‌రోప‌క్క‌, ఇప్పుడిప్పుడే బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌పై ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు.

ప్ర‌ధాన విప‌క్షం కాక‌పోయినా.అదేస‌మ‌యంలో మిత్ర‌ప‌క్షంగానూ లేక‌పోయినా.

ప‌వ‌న్‌.త‌న పంథాలో రాజ‌కీయం చేస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది.

అదేవిధంగా అధికార ప‌క్షంపై చేసే విమ‌ర్శ‌లు కూడా క‌న‌స్ట్ర‌క్టివ్‌గా ఉంటున్నాయ‌ని అంటున్నారు.ఏపీ హోదా విష‌యంలో జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌ను, ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌ను పోల్చితే.

ఈ తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.జ‌గ‌న్ రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబును విమ‌ర్శిస్తే.

ప‌వ‌న్ ఎక్క‌డా వాటి జోలికి పోకుండా.కేవ‌లం స‌బ్జెక్ట్ మీదే త‌న విమ‌ర్శ‌లు సంధించారు.

దీంతో ప‌వ‌న్‌కి ఇప్పుడు ఆద‌ర‌ణ పెరుగుతోంద‌నే టాక్ వ‌స్తోంది.ఇదే క‌నుక బ‌ల‌ప‌డితే.

రాబోయే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్పేలా లేవంటున్నారు పొలిటికల్ విశ్లేష‌కులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube