చేరికలకు వేళాయేరా ? టీడీపీ టు వైసీపీ ?  

tdp leaders try to join in ysrcp, CHandrababu, Jagan, Vallbhaneni Vamshi, Eluri Sambhasivarao, Anagani Satyaprasad, Doka Manikya Varaprasad - Telugu Anagani Satyaprasad, Chandrababu, Doka Manikya Varaprasad, Eluri Sambhasivarao, Jagan, Vallbhaneni Vamshi

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎక్కడా, తన దూకుడును తగ్గించడం లేదు.ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

 Chandrababu Jagan Eluru Sambasivarao Ysrcp

ఇప్పటికే 2019 ఎన్నికలు టీడీపీ కి గట్టి ఝలక్ ఇచ్చాయి.కేవలం 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని, 2024 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేస్తే, ఇక తమకు ఎదురే ఉండదనే అభిప్రాయంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు మరెంతో కాలం యాక్టివ్ పాలిటిక్స్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని, బిజెపి, జనసేన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందని,ఇక తమకు తిరుగే ఉండదు అనే అభిప్రాయంలో అధికార పార్టీ ఉంది.దీనిలో భాగంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను పార్టీలో చేర్చుకుంది.

చేరికలకు వేళాయేరా టీడీపీ టు వైసీపీ -Political-Telugu Tollywood Photo Image

అలాగే మరికొంత మందిని చేర్చుకోవాలనే ఆలోచనలో ఉండగానే, అకస్మాత్తుగా కరోనా ప్రభావం రావడంతో, చేరికలకు బ్రేక్ పడిపోయింది.ఇక టీడీపీలో మిగిలి ఉన్న కీలక నాయకులు చాలామంది, అనేక అవినీతి వ్యవహారాలు, వివిధ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్నారు.

దీంతో మిగతా టీడీపీ శ్రేణుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.ఇదే అదనుగా ఇప్పుడు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున టీడీపీ నాయకులను చేర్చుకోవాలనే అభిప్రాయంతో ఉంది.దీని కోసం జూలై 8 వ తేదీన ముహూర్తం కూడా పెట్టినట్లు సమాచారం.తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి వారు వైసీపీలో చేరకపోయినా, ఆ పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వచ్చేందుకు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వంటి వారు వస్తున్నారనే వార్తలు వచ్చినా, ఆ విషయాన్ని వారు ఖండించారు.

ఇక టీడీపీ ఎమ్మెల్సీలు చాలామంది అధికార పార్టీ లోకి వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి వారిని టీడీపీ నుంచి వైసీపీలోకి చేర్చుకున్నారు.డొక్కా కు అదే స్థానం నుంచి మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.మిగతావాళ్ల విషయంలోనూ అదే అభిప్రాయంతో ఉండడతో, పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు వైసీపీ లోకి వచ్చి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే విశాఖ నుంచి కూడా ఎమ్మెల్యేల వలసలు ఉండబోతున్నాయనే సంకేతాలు వైసీపీ ఇస్తోంది.దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైంది.

#Chandrababu #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Jagan Eluru Sambasivarao Ysrcp Related Telugu News,Photos/Pics,Images..