తెలుగుదేశం పార్టీలు అత్యంత సీనియర్ గా ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యవహారం టిడిపి అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి కావడం , ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ, అప్పట్లోనే కీలక మంత్రిపదవులు, వివిధ నామినేటెడ్ పదవులు చేపట్టారు బుచ్చయ్య చౌదరి.
చంద్రబాబుకు టిడిపి పగ్గాలు అప్పగించిన తర్వాత పూర్తిగా తన వర్గం అనుకున్న వారిని బాబు ప్రోత్సహించేవారు.అయితే ఆ లిస్టులో బుచ్చయ్య చౌదరి లేకపోయినా, ఆయనకు వరుసగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ వస్తున్నారు.
ఇప్పటికే తొమ్మిది సార్లు టికెట్ ఇవ్వగా, ఆరు సార్లు బుచ్చయ్య గెలిచారు.ప్రస్తుతం చంద్రబాబు లోకేష్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీకి పదవికి రాజీనామా చేస్తానంటూ హడావుడి చేస్తున్నారు.
బుచ్చయ్య వంటి సీనియర్ నేత బయటికి వెళ్లి పోతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో చంద్రబాబుకి తెలియంది కాదు.అందుకే దీని కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించారు.
ఆయన పార్టీని వీడకుండా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.అదే స్థానంలో మరే నాయకుడు ఉన్నా బాబు ఇంతగా పట్టుబట్టే వారు కాదు.
అయితే ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఆయన వద్ద చంద్రబాబు జాతకం ఉండడమే కారణమని ప్రచారం జరుగుతోంది.బుచ్చయ్య కూడా ఈ తరహా బెదిరింపులకు దిగుతున్నా చంద్రబాబు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారట.

ఎన్టీఆర్ పదవీచుత్యుడు అయిన సమయంలోనూ, అంతకుముందు జరిగిన పరిణామాలకు సంబంధించి వద్ద కీలక సాక్ష్యలు ఉన్నట్లు తెలుస్తోంది .అలాగే లక్ష్మీపార్వతి బూచిగా చూపించి చంద్రబాబు ఏ విధంగా రాజకీయం నడిపించారు అనే విషయం తో పాటు, మరికొన్ని అత్యంత రహస్యమైన విషయాలు తెలియడంతో. ఒకవేళ ఆయన పార్టీని వీడి చేయి దాటిపోతే ఆ కీలక ఆధారాలను బయట పెడితే పూర్తిగా అభాసు పాలు కావడంతో పాటు, ఎన్టీఆర్ వర్గాన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని , నందమూరి కుటుంబాల మధ్య వైరం మరింత ఆందోళన తో బాబు బుచ్చయ్య కు ఈ విధంగా బుజ్జగింపులు చేస్తున్నట్లు సమాచారం.