అనవసరంగా ఆ వర్గాన్ని దూరం చేసుకుంటున్న చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ నేడు తన ప్రాభవాన్ని కోల్పోయిందనే చెప్పొచ్చు.తెలంగాణలో అయితే టీడీపీ స్టేట్ ఛీఫ్ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.

 Chandrababu Is Unnecessarily Alienating That Category, Chandrababu, Politics , K-TeluguStop.com

ఇకపోతే ఉన్న కేడర్ కాస్తా మెల్లమెల్లగా ఇతర పార్టీల్లోకి వెళ్తోంది.విభజిత ఏపీకి పరిమితమైన చంద్రబాబు అక్కడ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.అయితే, ఏపీలో చంద్రబాబు కాపు సామాజిక వర్గాన్ని తన వైపు ఉంచుకోవడంలో విఫలమయ్యారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.2014 ఎన్నికలకు మందుర కాపు సామాజిక వర్గ నేతలతో సమావేశమై, ఆ సామాజిక వర్గానికి పలు హామీలు ఇచ్చి వారి విశ్వాసాన్ని పొందిన చంద్రబాబు, 2019 వచ్చే సరికి వారి నమ్మకాన్ని నిలుపులేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, కొందరు కాపు సామాజిక వర్గ నేతలకు పదవులు ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ పట్ల పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.అయితే, వైసీపీ అధినేత జగన్ మాత్రం కాపు సామాజిక వర్గం పట్ల మొదటి నుంచి ఒకే వైఖరి కలిగి ఉండటం గమనార్హం.

Telugu Andrapradesh, Chandra Babu, Telangana-Telugu Political News

కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం తన చేతుల్లోలేదని జగన్ ముందే ప్రకటించారు.అయినా కాపు సామాజిక వర్గం జగన్‌కు అండగానే నిలిచింది.ఈ క్రమంలోనే ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు తాజాగా ‘నేతన్న హస్తం’ కింద 2,384 మందికి ప్రయోజనాలు కల్పించారు.ఈ క్రమంలో అనవసర హామీలు ఇచ్చి కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తన నుంచి దూరం చేసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇకపోతే ఏపీలో రాజకీయాలు సామాజిక వర్గాల సమీకరణాల ద్వారానే జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే.కాగా, రాజకీయ పార్టీలు ఈ సమీకరణాలు పాటిస్తేనే సక్సెస్ అయ్యే చాన్సెస్ ఉంటాయి.

ఈ నేఫథ్యంలోనే తాజాగా అధికార వైసీపీ పార్టీలోనూ నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా కొన్ని విభేదాలు బయపడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube