బాబు కన్నీళ్లు : ఇక జనంలోకి బాబు ? ఏ విధంగా అంటే.. ? 

తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్లీ శాసనసభలో అడుగు పెడతానని,  అప్పటి వరకు ఈ సభలో అడుగు పెట్టేదే లేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.తన కుటుంబంపై వ్యక్తిగతంగా వైసీపీ ఎమ్మెల్యేలు,  మంత్రులు విమర్శలు చేయడాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికీ టీడీపీ పూర్తిగా నిరాశా నిస్పృహల్లో ఉంది.2019 నుంచి వరుసగా  ఓటములు ఎదుర్కుంటోంది.2024 నాటికి వైసీపీని ఎదుర్కునే అంత బలం పుంజుకుంటుందా అనేది కూడా అనుమానంగానే ఉంది.ఇప్పటికే పార్టీ నాయకులు చాలా మంది బిజెపి,  వైసిపి లో చేరగా, మరెంతో మంది రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.

 Chandrababu Is Thinking Of Making A Bus Trip If There Is No Padayatra Chandrabab-TeluguStop.com

ఈ పరిస్థితుల్లో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపై చాలా రోజులుగా చంద్రబాబు ఆలోచిస్తూనే ఉన్నారు.

      అది కాకుండా టిడిపికి కంచుకోటగా ఉంటూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలో ని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు చేసిన విమర్శలు చంద్రబాబు కన్నీళ్లు తెప్పించాయి.అసలు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద సంచలనంగా మారడంతో పాటు పార్టీ శ్రేణులలోను,  ప్రజలలోను కాస్త సానుకూలత ఏర్పడింది .దీంతో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని జనాల్లోకి వెళ్లి మరింతగా బలోపేతం కావాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు అట .
   

Telugu Ap Asembly, Ap, Chandrababu, Chandrababu Bus, Ysrcp-Telugu Political News

    అందుకే తిరుపతి నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట.ఐతే చంద్రబాబు వయసు రీత్యా పాదయాత్ర చేపట్టడం అంత సురక్షితం కాదని , అది కాకుండా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర వంటివి నిర్వహించి ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసే విధంగా ముందుకు వెళితే ఎలా ఉంటుంది అనే విషయం పై చంద్రబాబు దృష్టి సారించారు.ఇప్పుడు రేగిన సెంటిమెంట్ రాజకీయాన్ని ఉపయోగించుకుని జనాలలో బలం పెంచుకుంటేనే 2024లో టిడిపికి భవిష్యత్తు ఉంటుందని బాబు నమ్ముతున్నారు.

శాసనసభలోకి అడుగుపెట్టకపోయినా,  ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి వైసీపీ ప్రభుత్వం పై పూర్తి స్థాయిలో పోరాటం చేయడం ద్వారా,  తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రాగలము అనే విషయాన్ని బాగా నమ్ముతున్నారు.అందుకే కుదిరితే పాదయాత్ర లేకపోతే బస్సు యాత్ర చేపట్టి వైసీపీ పై పైచేయి సాధించాలనే వ్యూహంలో చంద్రబాబు ఉన్నారట.

     

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube