వారిని ప‌క్క‌న పెడుతున్న చంద్ర‌బాబు.. మంచిదేనంటున్న త‌మ్ముళ్లు..

ఈ మ‌ధ్య ఏపీ టీడీపీలో ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు ఎక్కువ‌వుతున్నాయి.సొంత పార్టీ నేత‌ల‌పైనే ఒక‌రిపై ఒక‌రు కంప్లయింట్లు చేసుకోవ‌డంతో చంద్ర‌బాబుకు ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

 Chandrababu Is Putting Them Aside Brothers Who Seem To Be Good Chandrababu, Ydp,-TeluguStop.com

ఇక రీసెంట్ గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపుతున్నాయి.ఇక ఈ జిల్లాకు చెందినటువంటి టీడీపీ నేతలు అందరూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల బాణం ఎక్కుపెడుతున్నారు.

ఇలాంటి మాట‌లు మంచివి కావంటూ చెబుతున్నారు.జేసీ బ్రదర్స్ ప్ర‌తిసారి ఇలాగే ఏదో ఒక వివాదాలు సృష్టిస్తున్నార‌ని, అందువ‌ల్ల పార్టీ ఇబ్బందిలో ప‌డుతోందంటున్నారు.

ఇక అప్ప‌ట్లో టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాల్టీగా తాడిపత్రి ఉండ‌టం, ఇక దీంట్లో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి గెల‌వ‌డంతో అది కొంచెం ఆయ‌న‌కు ప్ల‌స్ అయ్యే అంశం.అయినా కూడా దానిపై కాంట్ర‌వ‌ర్సీ మాట‌లు మాట్లాడారు ఆయ‌న‌.

అది త‌న గెల‌పు కాద‌ని, త‌న వెన‌క జగన్ ఉండ‌టం వ‌ల్లే సాధ్య‌మైందంటూ చెప్ప‌డంతో టీడీపీ పార్టీకి మైనస్ అయ్యింది.ఇక మొన్న కూడా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై ఎవ‌రికీ న‌మ్మ‌కం లేద‌ని, ఆయ‌న నాయ‌క‌త్వంలో మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోతుంద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

Telugu Ap Policemen, Ap, Chandrababu, Cm Jagan, Jc Brothers, Jc Prabhakar, Ysrcp

దీంతో ఆయ‌న మాట‌లు పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయి.ఇక చంద్రబాబు కూడా అన్నీ గ‌మ‌నిస్తూ వారిపై ఎలాంటి కామెంట్లు చేయ‌ట్లేదు.అయితే వీరికి తాజాగా నియ‌మించిన అనంతపురం పార్లమెంటరీ కమిటీలో జేసీ బ్ర‌ద‌ర్స్ అనుచ‌ర వర్గానికి స్థానం ఇవ్వ‌కుండా మిగ‌తా వారికి అవాక‌శం ఇచ్చారు.దీంతో చంద్ర‌బాబు సైలెంట్ గానే యాక్ష‌న్ తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు.

ఇలా చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్‌కు పెద్ద షాకే అయ్యింది.ఇక ఈ ప‌ని మంచిదే అని జిల్లా కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

జేసీ లాంటి వారిని ఇలా ప‌క్క‌న పెడితేనే పార్టీ పుంజుకుంటుంద‌ని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube