బాబు రివెంజ్ పాలిటిక్స్ ? జగన్ కు ఇబ్బందే ?

Chandrababu Is Preparing To Hold Several Huge Public Meetings In Ap

నిండు సభలో తనకు జరిగిన అవమానం పై  టిడిపి అధినేత చంద్రబాబు పగ తో రగిలిపోతున్నారు వైసిపి ప్రభుత్వం పైన జగన్ పైన తనకు జరిగిన అవమానం పై కక్ష తీర్చుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.

 Chandrababu Is Preparing To Hold Several Huge Public Meetings In Ap-TeluguStop.com

అంతే కాదు తన అవమానాన్ని ప్రజలకు జరిగిన అవమానంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే తన అవమానాన్ని పదే పదే  గుర్తుచేసుకుంటూ ఇంటికే పరిమితం కాకుండా జనాల్లోకి వచ్చేసారు.

వరద బాధితుల పరామర్శ పేరుతో జగన్ కు గట్టి పట్టు ఉన్న రాయలసీమ ప్రాంతంలో బాబు పర్యటనలు చేస్తున్నారు.జగన్ ఒక వృద్ధుడిని అందుకే జనాల్లోకి రాలేకపోతున్నాడని చెబుతూనే,  తాను తన వయసును కూడా లెక్కచేయకుండా జనాల కోసం తిరుగుతున్నానని సంకేతాలను బాబు ఇస్తున్నారు.

 Chandrababu Is Preparing To Hold Several Huge Public Meetings In Ap-బాబు రివెంజ్ పాలిటిక్స్ జగన్ కు ఇబ్బందే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కడప లో పర్యటించిన బాబు నేడు  చిత్తూరు ,నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడమే ఏకైక లక్ష్యంగా బాబు ముందుకు కదులుతున్నాడు.

తనకు జరిగిన అవమానానికి పార్టీ కేడర్ లోనూ పట్టుదల పెరిగిందని, జనాలలోను సానుభూతి కనిపిస్తుంది అని బాబు నమ్ముతున్నాడు.అందుకే జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జనాల్లోకి వెళ్లి టిడిపి గ్రాఫ్ పెంచుకోవడంతో పాటు,  జగన్ పై వ్యతిరేకత పెరిగేలా చేయాలని బాబు డిసైడ్ అయిపోయారు.

దీనిలో భాగంగానే భారీ బహిరంగ సభ లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.మూడు రాజధానులు బిల్లు వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు.

Telugu Ap, Ap Asembly, Cbn, Chandrababu, Kadapa, Karnool, Nelluru, Rayakaseema, Tdp, Tdp Open Meetings, Tirupathi, Ysrcp-Telugu Political News

ఇప్పటి వరకు అమరావతి, కర్నూల్, విశాఖ ఈ మూడు ప్రాంతాలను రాజధానిగా ప్రకటించినా, అభివృద్ధి ఏమాత్రం చేపట్టలేదనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు బాబు సిద్ధమవుతున్నారు.విశాఖ, అనంతపురం, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనాలు వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగేలా చేయాలనే వ్యూహంలో బాబు ఉన్నారట.ఈ భారీ బహిరంగ సభలకు భారీగా జన సమీకరణ చేపట్టి టీడీపీ సత్తా ఏంటో నిరూపించాలని చూస్తున్నారట.అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో అభివృద్ధి ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయింది .టీడీపీ నేతలు ఎంతమంది అనేక అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు ఇలా అనేక విషయాలపై భారీ బహిరంగ సభల్లో ప్రస్తావించేందుకు బాబు సిద్దమవుతున్నారట.

#Rayakaseema #Karnool #Chandrababu #Ysrcp #Nelluru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube