వారు దండగ ... వీరు అండగా ! బాబు లిస్ట్ రెఢీ ?

తెలుగుదేశం పార్టీ ఎంతో మంది కార్యకర్తల స్థాయి నాయకులను ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే విధంగా చంద్రబాబు ప్రోత్సాహం అందించారు.అధికారంలో ఉన్నన్నాళ్లూ వారికి ఎన్నో రకాలుగా ప్రోత్సాహం అందించి ఆర్థికంగా బలపడేందుకు ఛాన్స్ ఇచ్చారు.

 Chandrababu Preparing List Who Are Working Hard For The Party, Tdp, Chandrababu,-TeluguStop.com

ఆ కృతజ్ఞతతో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అటువంటి వారే అండగా నిలబడతారని భావిస్తూ వస్తున్నారు.అయితే సదరు నాయకులు మాత్రం అధికారంలో ఉన్న రోజుల్లో హడావుడి చేసినట్లు కనిపించినా, టిడిపి ప్రతిపక్షంలో కి వచ్చేసరికి అధికార పార్టీ అంటే ఉన్న భయం, కేసులు వేధింపులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఎవరికి వారు సైలెంట్ గా ఉంటున్నారు.

దీంతో టిడిపి తరఫున వాయిస్ వినిపించే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది .

అసలు పెద్ద ఎత్తున పార్టీ పదవులు అనుభవిస్తున్న వారు గతంలో ప్రాధాన్యమున్న పదవులు పొందిన వారు, టీడీపీ లో మంత్రులు, ఎమ్మెల్యేలు గా ఉన్నవారు సైలెంట్ గానే ఉంటున్నారు.కానీ అప్పట్లో పెద్దగా పదవులు , ప్రాధాన్యం పొందని వారు ఇప్పుడు టిడిపి తరుపున వాయిస్ వినిపిస్తూ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లోపాలను ఎత్తి చూపిస్తూ,  వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో క్రెడిట్ రాకుండా చూసుకుంటున్నారు.

కేవలం కొంతమంది సీనియర్ నాయకులు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు తప్ప మెజారిటీ నాయకులు సైలెంట్ గా ఉండిపోవడం బాబుకు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Jagan, Lokesh, Welfare Schemes, Ycp, Tdp, Ysrcp-Telugu P

అందుకే ప్రస్తుతం టిడిపి తరఫున వాయిస్ వినిపిస్తూ ప్రభుత్వంపై పోరాడుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మళ్ళ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.అందుకే ఒక లిస్ట్ ను సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం హైదరాబాదు లోనే ఉంటున్న చంద్రబాబు పార్టీని ప్రక్షాళన చేయడంతోపాటు మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలనే విషయంపైనే ఆలోచన చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ప్రస్తుతం ఉంటున్న నేతలకు రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పదవులను అప్పగించి , యాక్టివ్ గా లేని వారిని పదవుల నుంచి తప్పించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా టీడీపీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube