ఎంపీ అభ్యర్ధుల కోసం బాబు వెతుకులాట ? రేసులో ఉంది వీరే ?

రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిపెట్టారు.ఎన్నికల వ్యూహాలను ఇప్పటి నుంచే అమలు చేస్తూ, ఒక క్లారిటీ కి రావాలని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచి టిడిపి అధికారంలోకి వచ్చేలా చేయాలని భావిస్తున్నారు.

 Chandrababu Is Preparing A List Of Tdp Mp Candidates To  Contest The Upcoming El-TeluguStop.com

అందుకే ఇప్పటి నుంచే అన్నీ వ్యూహాలను అమలు చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఏర్పడకుండా ముందు నుంచే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బాబు సిద్ధం చేసుకుంటున్నారు.ముఖ్యంగా లోక్ సభ స్థానాలపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.2019 ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన వారిలో చాలామంది పార్టీకి దూరంగా ఉంటున్నారు.మిగిలిన వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఆర్థికంగా బలమైన వారిని 2024 ఎన్నికల్లో పోటీకి దింపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు .ఈమేరకు నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులను గుర్తించి… అప్పుడే వారిని ఎంపీ సీటు ఇస్తే పోటీ చేస్తారా లేదా అనే విషయం పైన ఆరా తీస్తున్నారట.లోక్ సభ అభ్యర్థులు ఆర్థికంగా బలమైన వారు అయితే , ఆ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన ఆర్థిక అండదండలు అందిస్తారనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఎంపీ అభ్యర్థుల కోసం వెతుకులాట మొదలు పెట్టారట.

శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి మళ్లీ సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక విజయనగరం ఎంపీ స్థానానికి మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారని భావిస్తున్నారు.ఆయన పోటీకి సముకత వ్యక్తం చేయకపోతే విజయనగరం పార్లమెంటు స్థానంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నారట.

అలాగే అరకు ఎంపీ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్ ఇప్పుడు పోటీ చేసే అవకాశమే లేదు.ఆయన చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

దీంతో ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.అలాగే విశాఖ లోక్ సభ స్థానానికి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పోటీ చేస్తారని సమాచారం.

అనకాపల్లి ఎంపీ సీటుకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఆడారి ఆనంద్ ప్రస్తుతం వైసిపి లో ఉన్నారు.దీంతో ఆ స్థానంలో టిడిపి సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పోటీ చేస్తారని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే కాకినాడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ ప్రస్తుతం వైసీపీలో ఉండడంతో.ఇక్కడ అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

ఒకవేళ జనసేన పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుంటే పొత్తులో భాగంగా కాకినాడ జనసేనకు కేటాయించే అవకాశం ఉందట.రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప ప్రస్తుతం టిడిపి కి దూరంగా ఉన్నారు.

దీంతో ఆ స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒకవేళ ఆయన కనుక పోటీకి దూరంగా ఉంటే ఇటీవలే పార్టీలో చేరిన బొడ్డు వెంకటరమణ ను అభ్యర్థిగా నిలబెట్టాలని చూస్తున్నారట.

అమలాపురం లోక్ సభ స్థానం నుంచి బాలయోగి కుమారుడు హరీష్ పోటీచేసి ఓటమి చెందారు.ఆయనే మరోసారి పోటీకి దింపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

Telugu Ap, Janasena, Janasenani, Mp Candis, Pavan Kalyan, Tdp Mp Candis, Teludes

నరసాపురం ఎంపీ స్థానం విషయంలోనూ ఒక క్లారిటీతో ఉన్నారట జనసేన తో పొత్తు ఖరారు అయితే ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారు.ఏలూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి బాబు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.దీంతో ఆ స్థానంలో బోళ్ల రాజీవ్ లేక దొరబాబు పేర్లను టిడిపి పరిశీలిస్తోంది.విజయవాడ నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి పోటీకి దిగుతారని అంచనా వేస్తున్నారు.

ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తే ఆయన స్థానంలో ఓ బడా పారిశ్రామికవేత్తను పోటీకి దింపుతారట.గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ మరోసారి పోటీ చేసే విషయంలో సందిగ్ధత నెలకొనడంతో, ఆ స్థానంలో మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఒంగోలు నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక పారిశ్రామికవేత్తను పోటీకి దింపాలని చూస్తున్నారట.

నెల్లూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ప్రస్తుతం వైసిపి లో ఉండడంతో ఆ స్థానంలో అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.ఇక హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, అనంతపురం నుంచి జెసి పవన్ మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

కడప నుంచి సీనియర్ నేత శ్రీనివాస్ రె,డ్డి కర్నూల్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్ ,నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డి, లేక ఫారుక్ , రాజంపేట నుంచి బెంగళూరుకు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త , చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి దివంగత ఎంపీ శివప్రసాద్ రెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.తిరుపతి నుంచి తర్వాత లక్ష్మి పేరు వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube