నిజం గెలిచి చంద్రబాబు బయటకు రావడం లేదు..: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

నిజం గెలిచి చంద్రబాబు బయటకు రావడం లేదని మంత్రి అంబటి తెలిపారు.కంటి ఆపరేషన్ ఉన్న నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.కేవలం వైద్యం నిమిత్తం మాత్రమే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని స్పష్టం చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు