అయ్యోయో.. చంద్రబాబు సిమెంట్ బొచ్చె, తాపీ పట్టుకొని ఏంచేస్తున్నారో ..?!  

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సిమెంట్ బొచ్చ, తాపీ చేతబట్టారు.తాజాగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అడ్డం పడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక విధానం పై అసెంబ్లీ లో ఆయన ఈ విధంగా నిరసన తెలియజేశారు.

TeluguStop.com - Chandrababu Is Holding Cement Fur And Masonry

ఈ సందర్భంగా బంగారాన్ని కొలిచే త్రాసుతో నిరసన ర్యాలీని చేపట్టాడు.బాబుతో పాటుగా మరి కొందరు టిడిపి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వచ్చారు.

రాష్ట్రంలోని ఇసుక ధరల పెంపకం, అలాగే ధర పెంచిన కానీ ఇసుక దొరక్కపోవడంతో అనేకమంది నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు అంటూ నినాదాలు చేపట్టారు.

TeluguStop.com - అయ్యోయో.. చంద్రబాబు సిమెంట్ బొచ్చె, తాపీ పట్టుకొని ఏంచేస్తున్నారో ..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదివరకు పూర్తిగా ఉచితంగా, తక్కువ ధరకు దొరికే ఇసుకను ఇప్పుడు సామాన్యుడికి కొనడానికి భారంగా తయారయిందని అందుకు సంబంధించి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులని ఆదుకోవాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సమస్య కారణంగా ఏకంగా 30 లక్షల మందికి పైగా కార్మికులు ఇబ్బంది పడుతున్నట్లు టిడిపి నేత అచ్చెన్నాయుడు తెలియజేశారు.

టిడిపి ప్రభుత్వం ఉన్న సమయంలో ఉచితంగా ఇసుకను ఇస్తుండగా తాజాగా జగన్ ప్రభుత్వం వచ్చి ఉచిత ఇసుకను రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించి అనేక మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమవుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.ఇసుకకు సంబంధించిన విధానం పూర్తిగా అవినీతి విధానం అంటూ పత్రికలలో ప్రకటనలు ఇచ్చి మరీ ఒప్పుకున్నట్లు ఆయన దుయ్యబట్టారు.అయితే జగన్ ప్రభుత్వంలో వచ్చిన కొత్త విధానాలపై జగన్ మోహన్ రెడ్డి, ఆ శాఖకు చెందిన మంత్రి పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుమూలంగా ఇసుక కాంట్రాక్ట్ కేవలం జగన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికైనా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

#Protest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు