మోదీ కాదు గడ్కారీ ! బాబు ఆశలు తీరేనా ?

బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన నష్టాన్ని తలుచుకుని ప్రతి దశలోనూ చంద్రబాబు బాధపడుతూనే ఉంటారు.అనవసరంగా తొందరపడి ఆ పొత్తు రద్దు చేసుకున్నామని, లేకపోతే ఏపీలో అధికార పార్టీ గా తాము చక్రం తిప్పే వారమని, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు.

 Chandrababu Is Happy With The Rss Promoting Nitin Gadkari As An Alternative To M-TeluguStop.com

తమతో పొత్తు రద్దయిన తరువాత జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంది.అయితే జనసేన కు టిడిపి విషయంలో సానుకూలత ఉండడంతో, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపికి దగ్గరయ్యేందుకు బాబు చాలా ప్రయత్నాలు చేశారు.

కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు.బిజెపి కి ఎంత దగ్గర అవుదామని చూస్తున్న, ఆ పార్టీ దూరం పెడుతూ వస్తుండడం తో బాబు ఆశ తీరడం లేదు.

అయినా బిజెపి అగ్రనేత నరేంద్ర మోడీ అమిత్ షా వంటి వారిని ప్రసన్నం చేసుకునేందుకు బాబు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ వంటి కీలక నేత అందరితోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతూనే వస్తున్న బాబుకు వారి వద్ద నుంచి ఇప్పటికే మద్దతును కూడగట్టారని, కానీ మోదీ మాత్రం దూరం పెడుతూ వస్తుండడం బాబుకు ఇబ్బందికరంగా మారింది.

అయితే బాబు ఆశలు ఇప్పుడు నెరవేరేలా కనిపిస్తున్నాయి .ఎందుకంటే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ కి వ్యతిరేకత పెరిగిందనే విషయం అందరికీ అర్థమైంది.అదీ కాకుండా మోదీ తీరుపై ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు, బీజేపీ లోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉండడం, ప్రస్తుతం కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేయలేకపోవడం,  గతంలో నోట్ల రద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, ఇలా ఎన్నో అంశాలు మోదీ గ్రాఫ్ బాగా తగ్గించాయి అని ఆర్ఎస్ఎస్ తో పాటు,  బిజెపి లోని ముఖ్యమైన వ్యక్తులు నమ్ముతున్నారు.

Telugu Amith Sha, Chandrababu, Jagan, Modhi, Nithin Gadkari, Ysrcp-Telugu Politi

 మోదీకి ప్రత్యామ్నాయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని హైలెట్ చేసే ఉద్దేశంలో ఆర్ ఎస్ ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.రాజకీయంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో నితిన్ గడ్కరీ అందవేసిన చేయి అని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు.మళ్లీ మోడీ సారథ్యంలోనే ఎన్నికలకు వెళితే పరాభవం తప్పదని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆయనకు ప్రత్యామ్నాయంగా నితిన్ గడ్కరీ ని ప్రమోట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయం బాబు కూడా లీకులు కూడా అందడంతో, ఆయన ఆనందానికి అవధులు లేవట.ఎందుకంటే నితిన్ గడ్కరీ తో చంద్రబాబు కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కేంద్రంలో కనుక పరిణామాలు మారితే అది తమకు కలిసి వస్తుందని నితిన్ గడ్కరీ ,  ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చనే ఆలోచన చంద్రబాబు ఉన్నారట

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube