సొంత నియోజకవర్గంలో ఓ ఇంటివాడు కాబోతున్న చంద్రబాబు

రాజకీయాల్లో చంద్రబాబు అపర చాణిక్యుడు.ఆయన వ్యూహాలకు ఎవరైనా బొక్కబోర్లా పడాల్సిందే.

 Chandrababu Is Going To Be A Householder In His Own Constituency , Chandrababu ,-TeluguStop.com

అయితే కాలంతో పాటు పరిస్థితులు కూడా మారిపోయాయి.ఇప్పుడు చంద్రబాబు అవుట్ డేటెడ్ అని అందరూ విమర్శిస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు దాటినా చంద్రబాబు ఇప్పటివరకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు నిర్మించుకోలేకపోయారు.దీంతో అత్యవసరంగా చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు.

అయితే 2014 వరకు హైదరాబాద్ ఉమ్మడి ఏపీ రాజధాని కావడంతో చంద్రబాబు అక్కడే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు.ఇప్పటికీ ఆయన నివాసం హైదరాబాద్‌లోనే ఉంది.రాష్ట్రం విడిపోయిన తర్వాత తాత్కాలికంగా మాత్రమే ఆయన ఏపీలో ఉంటున్నారు.అటు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబుకు సొంతిల్లు లేకపోవడంతో వైసీపీ పదే పదే విమర్శలు చేస్తోంది.

పైగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఆ పార్టీ కంకణం కట్టుకుంది.

ఎట్టకేలకు చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు సొంతింటి నిర్మాణం కోసం కొనుగోలు చేశారు.ఈ మేరకు కుప్పం పర్యటనలో శుక్రవారం నాడు ఇంటి స్థలానికి ఆయన రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.జూన్ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.

Telugu Chandrababu, Kuppam, Telugu Desam-Telugu Political News

వైసీపీ విమర్శలకు తాళలేక తాను కుప్పం వాసినే అని చెప్పుకోవడానికి రెండున్నర ఎకరాలలో చంద్రబాబు ఇన్నాళ్లకు అక్కడ మంచి ఇల్లు కట్టబోతున్నారు.అంతే కాదు ఈ ఇంటితో పాటు టీడీపీ ఆఫీస్ కూడా కట్టి తాను ఉన్నా లేకపోయినా ప్రజల నుంచి వినతులు తీసుకునేలా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.ఆరు నెలల్లో కుప్పంలో చంద్రబాబు ఇల్లు రెడీ అవుతుందని టీడీపీ నేతలు చెప్తున్నారు.మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇల్లు ఆయన్ను రికార్డు మెజారిటీతో గెలిపిస్తుందో లేదో వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube