ఈ అనవసర బురద మీకు అవసరమా బాబు ? 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న పరిణామం జరిగినా, దానిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెగ తాపత్రయ పడుతూ ఉంటారు.పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షం లో ఉంది .

 Chandrababu Is Facing Criticism In The Raghurama Krishnamraju Issue, Ap, Chandra-TeluguStop.com

మరో రెండున్నర ఏళ్ల పాటు ఏపీ సీఎంగా జగన్ ఉంటారు .ఈ విషయం అందరికీ తెలిసిందే.అయితే బాబు మాత్రం మధ్యలోనే ఏదో మ్యాజిక్ జరగబోతుంది,  జగన్ అధికారం కు దూరం అవుతారు అనే ఆశలు భారీగా పెట్టుకున్నారు.అందుకే చిన్న చిన్న విషయాల పైన బాబు తన స్థాయిని మరిచి స్పందిస్తూ టిడిపికి క్రెడిట్ తెచ్చేందుకు తాపత్రయపడుతున్నారు.

తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం చూసుకుంటే, ఇందులో టిడిపి పాత్ర పైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

రఘురామ అరెస్టు మొదలుకొని ప్రతి సందర్భంలోనూ టిడిపి గగ్గోలు పెడుతోంది.

అరెస్ట్ అక్రమం అంటూ నానా హడావుడి చేస్తోంది.టిడిపి నాయకులు అంతా ఇదే రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

అలాగే మొదటి నుంచి టిడిపి అనుకూల మీడియా రఘురామ వ్యాఖ్యలను ప్రచారం చేస్తూ, ఆయన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.ఇప్పుడు ఈ కేసులో టిడిపి అనుకూల మీడియా కూడా చిక్కుకుని విలవిల్లాడుతోంది.

ఇదే కాదు రఘురామకృష్ణంరాజు రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ మాట్లాడిన వీడియోలు సిఐడి అధికారులు సేకరించారు.ఇవి టీవీల్లోనూ ప్రచారం అయ్యాయి .దీనిపై ఆ సామాజికవర్గం మొత్తం ఆగ్రహంగా ఉంది.
  ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆ సామాజికవర్గం పెద్దలు చంద్రబాబుకు సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు.

Telugu Ap, Criticism, Chandra Babu, Chandrababu, Cid Ragurama, Jagan, Reddy, Tdp

అలాగే మతపరమైన విషయంలోనూ రఘురామ విమర్శలపై ఆ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉంది.ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనను  వెనకేసుకు వస్తూ ఉండడం వల్ల , ఆ సామాజిక వర్గాల వ్యతిరేకతను టిడిపి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.అసలు రఘురామా వైసిపి వ్యవహారంలో టిడిపి కలుగజేసుకోవటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.ఇప్పటికే టిడిపి అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఇప్పుడు ఇటువంటి అనవసర విషయాల్లో తలదూర్చి  మరింతగా నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube