శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న మంత్రి సిదిరి అప్పలరాజు టీడీపీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు పేదలంటే కోపం, చిరాకని మంత్రి సిదిరి తెలిపారు.గతంలో మత్స్యకారుల తొక్కతీస్తాం, తోలు తీస్తామన్నారు.
నాయి బ్రాహ్మణులకు తోకలు కట్ చేస్తామన్నారని మండిపడ్డారు.అలాగే బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాశారన్న విషయాన్ని గుర్తు చేశారు.
దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్న వ్యక్తి చంద్రబాబని పేర్కొన్నారు.ప్రజలను అవమానించడమే కాకుండా విద్య, వైద్యాన్ని కార్పొరేట్ మయం చేసి తన వాళ్లకు కట్టబెట్టారని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాకు కింజారపు కుటుంబం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
.