రండి 'బాబు' రండి ! ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుదాం

కేంద్ర అధికార పార్టీ బీజేపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించి తన కక్ష తీర్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారీగానే వ్యూహాలు రచిస్తున్నాడు.అందుకోసమే ఆ పార్టీ ఈ పార్టీ అనే బేధం లేకుండా బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటిని ఏకం చేసి బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కకుండా చేయాలనీ బాబు ప్లాన్ చేస్తున్నాడు.

 Chandrababu Invited All Parties In Ap For Against Bjp Promises-TeluguStop.com

ఇప్పటికే టీడీపీ బద్ద శత్రువైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు బాబు.అంతే కాకుండా బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బాబు కొత్త ఆలోచన చేస్తున్నాడు.

దీనిలో భాగంగా… ఏపీ విషయంలో కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీ సర్కార్ నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్ష సభకు బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించాలని బాబు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇప్పటికే బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ధర్మ పోరాట దీక్షలను నిర్వహిస్తున్నారు.ఈ దీక్షల్లో భాగంగా చివరి దీక్షను విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడు.ఈ దీక్ష సభకు బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.తాజాగా… అమరావతిలో నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని పార్టీ నేతలకు చెప్పారు.రాష్ట్రంలో ఇప్పటికే ఏడు ధర్మపోరాట దీక్ష సభలను నిర్వహించారు.

ఈ నెల 10వ తేదీన నెల్లూరులో ధర్మపోరాట దీక్షను నిర్వహించనునన్నారు.ఈ నెల 27వ తేదీన విజయనగరం జిల్లాలో 9వ ధర్మపోరాట దీక్షను నిర్వహిస్తారు.

ఆ తర్వాత అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ ఈ తరహా సభలను నిర్వహిస్తారు.

విజయవాడలో నిర్వహించే ధర్మపోరాట దీక్షలో బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ విపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేత అభిప్రాయపడ్డారు.తప్పుడు కేసులను బనాయించి విపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ అభిప్రాయంతో ఉంది.

ఇటీవల టీడీపీ ముఖ్య నేతలే లక్షయంగా…ఈడీ , ఐటీ శాఖలతో దాడులు చేయించి కక్ష తీర్చుకోవాలని చూస్తోందని ఈ బెదిరింపులకు భయపడేది లేదని బాబు చెప్పుకొస్తున్నారు.అలాగే ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడి వ్యవహారంలో బీజేపీ వెనకుండి వైసీపీతో డ్రామాలాడిస్తోందని బాబు మండిపడుతున్నారు.అందుకే… ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కోసం బాబు ప్రయత్నాలు ప్రారంభించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube