బాబు గారి సవాల్ : మా తప్పేమి లేదు మీకు దమ్ముంటే ?  

Chandrababu Inquiry Lg Polymers Issue - Telugu Chandrababu, Chandrababu Inquiry On Lg Polymers, Gas Leakage, Lg Polymers, Tdp Govt, Visakha, Ycp

విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి ఈ విషయంలో తప్పంతా గత తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వం దే అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుండడం, ఆ ప్రభుత్వం హయాంలోనే ఫ్యాక్టరీ కి సంబంధించిన విస్తరణ అనుమతులు లభించాయని, ఈ సంఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తప్పేమీ లేదంటూ, ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏపీ ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఎల్జీ పాలిమర్స్ ముందు వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన నిర్వహించారు.

 Chandrababu Inquiry Lg Polymers Issue

అధికారులు గానీ, ప్రభుత్వంగానీ తమ గ్రామాన్ని పట్టించుకోవడంలేదని, అధికారులు ఈ సంఘటనకు సంబంధించి వెంకటాపురంలో కాకుండా, బయట గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని , ఇతర గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ గ్రామాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన నిర్వహించారు.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

బాబు గారి సవాల్ : మా తప్పేమి లేదు మీకు దమ్ముంటే -Political-Telugu Tollywood Photo Image

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు ఎవరి హయాంలో ఏం అనుమతులు వచ్చాయి అన్నదానిపై చర్చకు తాము సిద్ధమని, ప్రభుత్వానికి దమ్ముంటే తమతో చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు.ఈ పరిశ్రమకు సంబంధించి అన్ని అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దానిని దాచిపెట్టి ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎల్జి పాలిమర్స్ ప్రస్తుతం వినియోగిస్తున్న 219 ఎకరాల భూమిని 1964లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించగా, ఈ భూమికి అర్బన్ సీలింగ్ చట్టం నుంచి 1992లో మినహాయింపు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు.

ఇక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక ఎకరం కూడా ఎల్ జి సంస్థకు కేటాయించలేదని, 2007లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు.అలాగే 2009లో ప్రభుత్వం మరోసారి అనుమతులు మంజూరు చేసిందని, 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు సార్లు అనుమతి ఇచ్చిందని, టిడిపి ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులను రెన్యువల్ మాత్రమే చేసిందని కొత్తగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, అంతేకాకుండా పాలి స్టెరిన్ , ఎక్స్పాండబుల్ పాలి స్టెరిన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి తమ హయాంలో అనుమతి నిరాకరించామని బాబు గుర్తు చేశారు.ఇదే విషయాన్ని ఎల్జీ కంపెనీ తన అఫిడవిట్ లో స్వయంగా తెలిపిందని చంద్రబాబు వివరించారు.

కానీ వైసీపీ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేసి ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు