తప్పు తెలుసుకున్న టిడిపి ! ఇక జగన్ రూట్లోనే ?

2019 నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి వరుసగా అన్ని అపజయాలే ఎదురవుతున్నాయి.పార్టీని బలోపేతం చేద్దాం అని చూస్తున్నా, అది సాధ్యపడడం లేదు.

 Chandrababu Naidu In The Idea Of Purging Telugu Desam Party , Jagan, Ysrcp, Tdp,-TeluguStop.com

పార్టీ శ్రేణుల్లో పూర్తిగా నిరాశ,  నిస్పృహలు అలుముకున్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, పెద్దగా  బలంలేని జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉండడం,  అధికార పార్టీ వైసీపీ బలం ముందు తాము తేలిపోతూ ఉండడం, వంటివి పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి.

పార్టీ శ్రేణులను ఉత్సాహపరచి ముందుకు తీసుకు వెళ్లి తెలుగుదేశం పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో జాతీయ , రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులను భర్తీ చేశారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ పదవులను భర్తీ చేసిన చరిత్ర లేదు.

అయినా ఆ పదవులను భర్తీ చేయడం వల్ల కొత్తగా పార్టీ కి కలిసి వచ్చింది ఏమీ లేదు అనే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించారు.
  ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనం గా కనిపించాయి.

అయితే దీనికంతటికీ కారణం ఏమిటనే విషయంపై చంద్రబాబు లోతుగా ఆలోచిస్తే , పార్టీ పదవులు అన్ని ఎక్కువగా పార్టీ సీనియర్ నాయకులకు ఇవ్వడం, వారి ప్రభావం పెద్దగా లేకపోవడం, పేరుకు సీనియర్లు అయినా, పలుకుబడి లేకపోవడం, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు అనుగుణంగా రాజకీయాలు చేయలేక పోవడం వంటివి ఇబ్బంది కరంగా మారాయి.అందుకే  మరోసారి పార్టీని ప్రక్షాళన చేయాలని , పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ,  వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ,  పెద్దగా గుర్తింపు లేని నాయకులందరినీ ఇప్పుడు గుర్తించి , వారికి కీలక పదవులు అప్పగించి పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉందట దీని కోసం వైసీపీ అధినేత సీఎం జగన్ రూట్ లోనే వెళ్లాలని టిడిపి నిర్ణయించుకుంది.

వైసిపి విషయానికి వస్తే,  అక్కడ అధినేత జగన్ అభిప్రాయం ఫైనల్.

Telugu Ap Cm Ys Jagan, Ap, Chandrababu, Jagan, Tdp Seat, Tdp Senior, Telugudesam

  కింది స్థాయిలో భర్తీ చేసిన పదవులు అన్ని పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారిని కే కట్టబెట్టారు.  సామాజిక, ఆర్థిక విషయాలను సైతం పక్కనపెట్టి పార్టీ కోసం ఏదైనా చేయగలిగిన నేతలను జగన్ గుర్తించి,  వారికి పదవులు కట పెట్టారు.అందుకే వైసిపి ఈ స్థాయిలో బలంగా ఉంది .జగన్ ఆశయాలను, ఆలోచలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు.  కానీ టిడిపిలో ఆ పరిస్థితి లేకపోవడంతో,  ఇక పై జగన్ రూట్ నే ఎంచుకోవాలనే ఆలోచనలో టిడిపి ఉందట.

నేటితో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తంతు ముగిసిపోనున్న నేపథ్యంలో, ఇక పూర్తిగా పార్టీ ప్రక్షాళన పై దృష్టి పెట్టి, 2024 నాటి కి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న పట్టుదలతో అధినేత చంద్రబాబు ఉన్నారట.   

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube