ప్రధాని రేసులో బాబు ? బీజేపీ వ్యతిరేక కూటమి ఒత్తిడి ? 

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని రేసులో ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్లుగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తీరు, దానికి తగ్గట్టుగానే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బిజెపి ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, ఎలా అయినా సరే పశ్చిమబెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలని బిజెపి కేంద్ర పెద్దలు ఎంతగా ప్రయత్నాలు చేసినా చివరకు అక్కడ మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.

 Chandrababu In Pm Race Bjp Anti Coalition Pressure-TeluguStop.com

దీంతో మరింత ఉత్సాహంగా బిజెపి వ్యతిరేక పార్టీల నేతలతో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసి ,  రాబోయే ఎన్నికలలో బీజేపీకి అధికారం దూరం చేయాలనే ఆలోచనలు మమత ఉన్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి 15 పార్టీల కు ఆమె లేఖ రాశారు .కాంగ్రెస్ , ఎన్సీపీ, డీఎంకే , శివసేన, వైసిపి , టిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ , బిజెడి,  సమాజ్ వాదీ, నేషనల్ కాన్ఫరెన్స్ , పిడిపి , వంటి పార్టీలకు మమత నుంచి లేఖలు వెళ్ళాయి.ఇప్పటికే కొన్ని పార్టీలు బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కి మద్దతుగా నిలిచాయి.

 Chandrababu In Pm Race Bjp Anti Coalition Pressure-ప్రధాని రేసులో బాబు బీజేపీ వ్యతిరేక కూటమి ఒత్తిడి  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలాచోట్ల బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో, బీజేపీ వ్యతిరేక కూటమిని మరింత బలోపేతం చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతో మమత బెనర్జీ తోపాటు,  బిజెపి తీవ్రంగా వ్యతిరేకించి కొన్ని పార్టీల నాయకులు ఆలోచన చేస్తున్నారు .అయితే ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఉంచాలి అనే విషయం పైన అప్పుడే చర్చ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Ap, Bjp, Chandrababu, Chandrababu Prime Minister, Congress, Dmk, Mamatha Benarji, Narendra Modi, National Politics, Pdp, Sarad Pawar, Saradpavaar, Shivasena, Tdp, Trs, Ycp-Telugu Political News

  అయితే మెజార్టీ పార్టీల అధినేతలు మమతా బెనర్జీని పీఎం అభ్యర్థిగా ఒప్పుకోవడం లేదట.పరిపాలనలో ఆమెకు సరైన విధానం వంటివి లేకపోవడం తదితర కారణాలతో చంద్రబాబు పేరు ప్రధాని రేసులో కి శరద్ పవార్ తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది .40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం తో పాటు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా విశేష అనుభవం ఉండటం, రాజకీయ వ్యూహాలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో శరత్ పవర్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.అయితే మరికొన్ని పార్టీలు వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే ఇందులో టిఆర్ఎస్ సైతం ఉండడం, అలాగే జగన్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉండటంతో బాబు పేరు పైన సందిగ్ధత ఏర్పడినట్లు తెలుస్తోంది.ఏపీ ప్రయోజనాలు చేకూర్చే ఈ విషయంలో గతంలో బీజేపీతో బాబు తలపడిన తీరు వంటివి హైలెట్ చేస్తూ,  శరద్ పవార్ బాబు పేరునే ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

కానీ బాబు మాత్రం బీజేపీ తో పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండడం కొసమెరుపు.

#Chandrababu #Saradpavaar #Mamatha Benarji #Narendra Modi #Sarad Pawar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు