బాబు కు పెరిగిన ధీమా ? చాలా ఇంకా కావాలా ? 

ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాస్త ఆందోళన పెంచుతున్నా,  రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం టిడిపి అధినేత చంద్రబాబు కు ఎక్కడలేని ఆనందాన్ని కలిగిస్తున్నాయి.మొన్నటి వరకు పార్టీ కేడర్ తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉండేది.

 Chandrababu In Dheema Said That Telugudesam Will Come To Power Again-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ 2024లో ను అధికారంలోకి రాదు అన్న అభిప్రాయం పార్టీ నేతలకు రావడంతో పెద్ద ఎత్తున ఇతర పార్టీలోక చేరిపోయారు.పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడమే మానేశారు.

వైసీపీ ప్రభుత్వం పై పోరాడాలని,  ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై నిరసన తెలియజేయాలని పదేపదే చంద్రబాబు విజ్ఞప్తి చేసినా, పెద్దగా ఫలితం అయితే కనిపించేది కాదు.దీంతో చంద్రబాబు ఆందోళనకు గురయ్యే వారు.

 Chandrababu In Dheema Said That Telugudesam Will Come To Power Again-బాబు కు పెరిగిన ధీమా చాలా ఇంకా కావాలా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

   ఇదే రకమైన పరిస్థితి ముందు ముందు కొనసాగితే టిడిపి పూర్తిగా భూస్థాపితం అవుతుందనే విధంగా పరిస్థితి ఉంది.దీనికితోడు పార్టీలోని సీనియర్ నాయకులు బహిరంగంగా లోకేష్ పనితీరుపై విమర్శలు చేయడం, తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉండడం,  ఇలా ఎన్నో పరిణామాలు టిడిపి నిరుత్సాహాన్ని పెంచుతూ వచ్చాయి అయితే గత కొంత కాలంగా చూసుకుంటే పరిస్థితిలో మార్పు వచ్చింది.

చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పదేపదే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం పై మొదట్లో ఉన్న సానుకూలత ఇప్పుడు కనిపించకపోవడం, ఏపీ లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోకపోవడం, సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా పెరగడం ఇవన్నీ టిడిపిలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

ఇప్పటికే బాబు రహస్యంగా చేయించిన సర్వేల్లో టిడిపి మునుపటి కంటే బాగా బలం పుంజుకుందని, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందని, ఇదే రకంగా ముందుకు వెళ్తే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని నివేదిక రాయడం చంద్రబాబును మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
     

Telugu 2024 Elections, Ap, Ap Cm Jagan, Bjp, Cbn, Chandrababu, Congress, Lokesh, Lokesh Arrest, Tdp, Tdp Leaders, Ysrcp-Telugu Political News

   ఇక ఇటీవల లోకేష్ ను అరెస్టు చేసిన వ్యవహారం ఇవన్నీ టిడిపి మైలేజ్ తీసుకువచ్చాయి.వైసిపి ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఏ తరహాలో అయితే ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ఓదార్పు యాత్రలు నిర్వహించారో, అదే రకంగా ఇప్పుడు లోకేష్ వ్యవహరిస్తుండడం టిడిపికి బాగా కలిసి వస్తున్నాయి.ఈ పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నాము అనే ధీమా లో కనిపిస్తున్నారు.

#Lokesh #Ysrcp #Lokesh #Chandrababu #TDP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు