కరోనా టెన్షన్ లో చంద్రబాబు..??

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.గత వారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసిన చంద్రబాబు తిరుపతిలో ప్రతి ఇంటికి వెళ్తూ టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు.

 Chandrababu In Corona Tension-TeluguStop.com

ఇలాంటి తరుణంలో తిరుపతిలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఊహించని విధంగా పెరుగుతూ ఉండటం పాటు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నాయకులు కరోనా బారిన పడటం జరిగింది.

తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలడంతో టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

 Chandrababu In Corona Tension-కరోనా టెన్షన్ లో చంద్రబాబు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలే చంద్రబాబుతో కలిసి ఆయన శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.ఆ సమయంలో చంద్రబాబు పక్కనే ఉన్న ఆయన కనీసం మాస్కు కూడా ధరించలేదు.అంతేగాకుండా చంద్రబాబుతో సన్నిహితంగా మాట్లాడారు.దీంతో చంద్రబాబుకి కరోనా టెన్షన్ పట్టుకున్నట్లు టీడీపీ క్యాడర్ నుండి అందుతున్న టాక్.

ఇదిలా ఉంటే పాజిటివ్ రిపోర్ట్ రావడంతో సుధీర్ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

.

#BojjalaSudheer #Tirupathi #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు