ఆత్మకూరు సభలో చంద్రబాబు  

Chandrababu In Atmakur Meeting-bjp,chandrababu,development,hyderabad,jagan,meeting,nellore District,political Updates,tdp,ycp

నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఏపీ సి ఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అలానే ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హైదరాబాద్ ని ఏవిధంగా అయితే అభివృద్ధి చేశానో అదే విధంగా అమరావతి ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు...

ఆత్మకూరు సభలో చంద్రబాబు-Chandrababu In Atmakur Meeting

అలానే బీజేపీ,వైసీపీ పార్టీల పై ఆయన విమర్శలు చేసారు. కోడి కత్తి రాజకీయాలు చేసేవారు ఏవిదంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని బాబు ప్రశ్నించారు. కోడి కత్తి పార్టీల వల్ల ఉద్యోగాలు రావని బాబు అన్నారు.

అలానే పులివెందులలో ఎప్పుడూ ఇలాంటి స్పందన చూడలేదని,తెలంగాణా సి ఎం కేసీఆర్ మనల్ని అడుగడుగునా అవమానించారని బాబు ఆరోపించారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తే మనల్ని పనికి రాని వ్యక్తులుగా పరిగణించారని బాబు అన్నారు. అలానే హైదరాబాద్ లో కనీసం కూర్చొనేందుకు కూడా కుర్చీ లేకుండా చేసారని విమర్శించారు.

హైదరాబాద్ కంటే అద్భుతంగా అమరావతి ని నిర్మిస్తానని, ఏపీ లో 20 హైదరాబాద్ లు తయారు చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు.