మలుపులు తిరుగుతున్న 'గెస్ట్ హౌస్' రాజకీయం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ లో హాట్ టాపిక్ గా చంద్రబాబు ఉంటున్న నివాసం మారింది.ఉండవల్లి సమీపంలో కృష్ణా నది కరకట్ట పై ఉన్న బాబు నివాసం అక్రమంగా కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటూ ప్రభుత్వం చర్యలకు దిగుతోంది.

 Chandrababu House Turn In Newpolitical Way Ramesh-TeluguStop.com

ఇంకా కరకట్ట లోని అనేక నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేశారు.నెమ్మదిగా కూల్చివేత ప్రక్రియ కూడా మొదలుపెట్టారు .ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.ఇక గెస్ట్ హౌస్ యజమాని రమేష్ కూడా రంగంలోకి దిగి సీఎం జగన్ కు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కరకట్ట పై ఉన్న అతిథి గృహం కూల్చివేత నోటీసులపై 5 పేజీల లేఖను కూడా లింగమనేని రాశారు.తమ అతిథి గృహానికి 2012లో ఉన్న చట్టాలకు అనుగుణంగానే నిర్మించామని, బాధ్యతగల పౌరుడిగా నే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి తన నివాసాన్ని ఇచ్చానని, ఇప్పుడు రాజకీయ కక్షతో ఆ ఇంటిని కూల్చి వేస్తానంటూ భయపెడుతుండడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నట్టు లింగమనేని ఆ లేఖలో పేర్కొన్నారు.

Telugu Chandrababu, Karakatta, Krishna River, Ysjagan-Telugu Political News

  లింగమనేని లేఖలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే .ఉండవల్లి లోని అతిథి గృహానికి 2012లో లో అప్పుడు ఉన్న చట్టపరమైన అన్ని అనుమతులు పొందాం.ఇరిగేషన్ శాఖ లోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఎన్ఓసి కూడా తీసుకున్నాం.కూల్చివేత ధోరణి వల్ల ప్రభావితం అయ్యేది నా ఒక్క కుటుంబం మాత్రమే కాదు, ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశ నిస్పృహలో కి నెట్టివేస్తుంది.

ఇటువంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోగలరు.ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ది కోసం తపిస్తున్న తనలాంటి వ్యక్తులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఏమేరకు సబబు అంటూ జగన్ కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

అయితే ఇదే రమేష్ గతంలో అక్రమ కట్టడం పై వివాదం చెలరేగిన సమయంలో ఆ భవనంతో ప్రస్తుతం తనకు ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందే చెప్పారు.

Telugu Chandrababu, Karakatta, Krishna River, Ysjagan-Telugu Political News

  చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని తాను నిర్మించిందే అయినా దాన్ని ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చేసాను కాబట్టి దాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని , దాన్ని ఉంచుతారా లేక కూల్చుతార అనేది ప్రభుత్వం ఇష్టం అంటూ చెప్పాడు.ఇక చంద్రబాబు కూడా ఓ సందర్భంలో అసెంబ్లీ లో మాట్లాడుతూ లింగమనేని గెస్ట్ హౌస్ ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, అందుకే తాను సీఎం హోదాలో అక్కడ నివాసం ఉంటున్నారని చెప్పారు.కానీ ఇప్పుడు ఆ విషయాల గురించి మాత్రం వీరు ప్రస్తావించడం లేదు.

ప్రస్తుతం లింగమనేని జగన్ కు రాసిన లేఖపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.లింగమనేని గెస్ట్ హౌస్ కు ఎటువంటి అనుమతులు లేవని, దీనిపై చంద్రబాబు కానీ, లింగమనేని రమేష్ కానీ తనతో చర్చకు వస్తే తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube